కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అజిత్( Hero Ajith ) వరుసగా యాక్షన్ సినిమాలలో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.భిన్నమైన కథలను ఎంచుకుంటున్న అజిత్ సినిమాలకు కలెక్షన్లు సైతం రికార్డ్ స్థాయిలో వస్తున్నాయి.
సినిమా ఇండస్ట్రీలో జెంటిల్ మేన్ గా గుర్తింపును సంపాదించుకున్న అజిత్ ప్రస్తుతం ఎలాంటి వివాదాలు లేకుండా కెరీర్ ను విజయవంతంగా కొనసాగిస్తూ అభిమానులకు దగ్గరవుతున్నారు.
అజిత్ భార్య పేరు షాలిని( Shalini ) కాగా కోలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒకటనే సంగతి తెలిసిందే.అజిత్ కు బైక్ రైడ్ ఇష్టమనే సంగతి తెలిసిందే.అజిత్ తన సినిమాల ప్రమోషన్స్ ను పెద్దగా పట్టించుకోరు.2000 సంవత్సరంలో అజిత్ షాలిని వివాహం జరిగింది.అమర్ కలం అనే సినిమా షూటింగ్ సమయంలో అజిత్ షాలిని ఒకరితో ఒకరు ప్రేమలో పడ్డారు.
ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించడంతో అజిత్ షాలిని పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు.
అయితే షాలిని కంటే అజిత్ మరో హీరోయిన్ తో రొమాన్స్ చేశాడని సమాచారం అందుతోంది.
తమిళ నటి హీరా రాజగోపాల్ ను అజిత్ ప్రేమించారని తెలుస్తోంది.అప్పట్లో కోలీవుడ్ ఇండస్ట్రీ( Kollywood )లోని టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఈ బ్యూటీ పేరు సంపాదించుకున్నారు.
అజిత్ కు కెరీర్ తొలినాళ్లలో హీరా రాజగోపాల్ పలు మూవీ ఆఫర్లు సైతం ఇప్పించారట.తర్వాత రోజుల్లో బేదాభిప్రాయాలు రావడంతో వాళ్లిద్దరూ విడిపోయారట.
కోలీవుడ్ నటుడు, సినీ క్రిటిక్ బైల్వాన్ రంగనాథన్( Bayilvan Ranganathan ) ఈ విషయాలను వెల్లడించారు.స్వాతి అనే మరో హీరోయిన్ ను సైతం అజిత్ ప్రేమించాడని అయితే స్వాతి కుటుంబం పెళ్లికి అంగీకరించలేదని తెలుస్తోంది.అజిత్ షాలిని పర్ఫెక్ట్ పెయిర్ అని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయం వ్యక్తం చేశారు.అజిత్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
హీరాతో అజిత్ కు ఎఫైర్ ఉందని అప్పట్లో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.