Rajamouli : స్టార్ డైరెక్టర్ రాజమౌళికి రచయిత సహాయం కావాలా.. మహేష్ సినిమాకు ఎవరు సాయం చేస్తారా?

మహేష్ బాబు, రాజమౌళి ( Mahesh Babu, Rajamouli ) కాంబినేషన్లో మూవీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఆ సినిమాపై అభిమానులలో ఆసక్తి నెలకొంది.

ఇంకా ఈ సినిమాకి టైటిల్ ని రివీల్ చేయలేదు.

ఈ సినిమా మహేష్ బాబుకి 29వ సినిమా కావటంతో ఎస్ ఎస్ ఎం బి 29 ( SSMB 29 ) అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు.ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్ లో ఉంటుందన్న విషయం ప్రకటించినప్పటి నుంచి అభిమానులలో అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

ఇప్పుడు డైలాగు వెర్షన్ మొదలు పెట్టాలి కాబట్టి రాజమౌళి ఒక రచయిత కోసం వెతుకుతున్నారంట.సాధారణంగా రాజమౌళి సినిమా అనగానే పర్మినెంట్ గా పనిచేసే సాంకేతిక బృందం ఉంటుంది.

Advertisement

అందులోనూ ఎక్కువగా వారి కుటుంబ సభ్యులే ఉంటారు.ఒక్క రచయితలని మాత్రం రాజమౌళి మారుస్తూ ఉంటారు.

ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం బుర్ర సాయి మాధవ్ ( Burra Sai Madhav ) రచయితగా వర్క్ చేశారు.

కానీ మహేష్ సినిమా కోసం ఆయనని కాకుండా మరొక రచయిత కోసం వెతుకుతున్నట్లు సమాచారం.నిజానికి జక్కన్న సినిమాలో పనిచేసే డైలాగ్ రైటర్స్ కి పెద్దగా పని ఉండదు, ఎందుకంటే ఆయన సినిమాల్లో ఎక్కువగా ఎమోషన్ యాక్షన్స్ కి పీట వేస్తారు కాబట్టి డైలాగు ఓరియంటెడ్ సన్నివేశాలు చాలా తక్కువగా ఉంటాయి.కీ డైలాగ్స్ కూడా నేరేషన్ సమయంలో జక్కన్న ఫీడ్ చేసేస్తారు.

అంతకుముందు సినిమాలకు రత్నం, కాంచి డైలాగులు రాసేవారు.ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం బుర్ర సాయి మాధవ్ రాశారు.మరి ఇప్పుడు వేరే రచయిత కోసం ఎదురుచూస్తున్న రాజమౌళి ఎవరిని డైలాగ్ రైటర్ గా పెట్టుకుంటారా అనే ఉత్కంఠత అందరిలో నెలకొంది.

అక్కడ ఎన్నికలు పెడితే పూరీ జగన్నాథ్ సీఎం నేను హోం మినిష్టర్.. అలీ ఏమన్నారంటే?
డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఇక ఈ సినిమా కోసం మహేష్ బాబు లుక్ టెస్ట్ చేయించుకోగా 8 లుక్స్ ని ఫైనలైజ్ చేసారంట రాజమౌళి.అయితే సినిమాకి సంబంధించిన వివరాలు ఏవి వెల్లడించకుండా టీం చాలా జాగ్రత్తలు పాటిస్తుంది.

Advertisement

తాజా వార్తలు