టాలీవుడ్‌లో స్టార్ హీరోలతో వరుసగా తిరుగులేని హిట్లు ఇచ్చిన ఘనత పూరి జగన్నాథ్‌ది.ఆ తర్వాత పూరికి ఇక్కడ టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ అన్న పేరుంది.
పూరి దర్శకత్వంలో సినిమా వచ్చిందంటే చాలు… అభిమానులు థాయేటర్లకి క్యూ కట్టేవారు.హీరోలతో సంబంధం లేకుండా పూరికి అభిమానులు ఉండేవారు.
ఇదంతా గతం.ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
పూరి దర్శకత్వ క్రేజ్ జనాలను థియేటర్లకు రప్పించలేకపోతోంది.దీంతో పాటు పూరి వరుస ప్లాపులతో సతమతమవుతున్నాడు.
పూరి టెంపర్‌కు ముందు వరుసగా ప్లాపులే తీశాడు.టెంపర్ మాత్రం లైవ్ కంటెంట్‌తో రావడంతో పాటు ఎన్టీఆర్ యాక్షన్‌తో ఏదోలా గట్టెక్కేసింది.
టెంపర్ తర్వాత పూరి తీసిన జ్యోతిలక్ష్మి-లోఫర్-ఇజం సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.దీంతో ఒకప్పుడు ఆయన ఇంటి ముందు క్యూ కట్టిన పెద్ద హీరోలే ఇప్పుడు డేట్స్ ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారు.
దీంతో పూరీ టాలీవుడ్ కి టాటా చెప్పెయ్యడానికి నిర్ణయించుకున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి.
ఇందుకు కారణం ఏంటంటే కన్నడలో పూరి ఓ భారీ డీల్ కుదుర్చుకున్నాడట.
కన్నడ నిర్మాత సీఆర్ మనోహర్ తో పూరీ మూడు చిత్రాలు చేయడానికి ఒప్పందం చేసుకున్నాడట.ఈ ఒప్పందంలో భాగంగానే నిర్మాత తనయుడు ఇషాన్ ని పరిచయం చేస్తూ రోగ్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత కూడా మరో సినిమా ఇషాన్‌తో మూడో సినిమా అక్కడ యంగ్ హీరోతో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, మహేష్‌తో పాటు కనీసం మీడియం రేంజ్ హీరోలు కూడా పూరితో సినిమా చేసేందుకు ఆసక్తిగా లేరు.
మరి పూరి శాండల్‌వుడ్‌లో సత్తా చాటి తెలుగులో రీ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.







