తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యాంకర్ సుమ కనకాల( Suma Kanakala ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో ఎన్నో షోలకు ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరించి చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో మందిని అలరించింది సుమ.
తన తన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు ప్రేక్షకులను నవ్విస్తూ రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.స్టార్ మహిళ, క్యాష్, పంచావతారం, సూపర్ సింగర్, అవాక్కయ్యారా, జీన్స్, భలే చాన్సులే, పట్టుకుంటే పట్టుచీర, లక్కు కిక్కు వంటి ఎన్నో షోలతో మంచి గుర్తింపు దక్కించుకుంది.

ఇక టాలీవుడ్ అగ్ర హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు( pre-release events ) సుమ తప్పకుండా ఉండాల్సిందే.ఇంకా చెప్పాలంటే ఈమె డేట్స్ కోసం హీరోలు వారి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఇకపోతే సుమ రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.రీసెంట్‌గా వీరి దాంపత్య జీవితానికి 25 ఏళ్ళు గడిచాయి.వీరిద్దరూ పెళ్లి చేసుకుని పాతికేళ్ళు గడిచిన సందర్భంగా సుమ సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేసింది.ఈ వీడియో చూస్తుంటే సుమ, కనకాల అంగరంగ వైభవంగా మ్యారేజ్ డే ను జరుపుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా వృద్ధాశ్రమానికి కూడా వెళ్లి.తమకు తోచిన సాయం చేశారు.

ఈ క్రమంలో సుమ ఒక కార్యక్రమం నిర్వహించింది.తన యూట్యూబ్ ఛానల్( YouTube channel ) లో ఉన్న సబ్ స్క్రైబర్లు అడిగిన క్వశ్చన్స్‌కు సుమ, కనకాల నవ్వుతూ సమాధానాలు చెప్పారు.మీ భార్యకి తెలియకుండా ఆమె ఫోన్ ఎప్పుడైనా చెక్ చేశారా అని రాజీవ్‌ను అడగ్గా.లేదు ఎప్పుడు అలా చేయలేదు అని తెలిపారు రాజీవ్.సేమ్ క్వశ్చన్ సుమను అడగ్గా.చేశాను ఒకసారి అని బిగ్గరగా నవ్వే బొమ్మలు పెట్టి సమాధానం ఇచ్చింది సుమ.దీంతో రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయి చూస్తాడు.సుమ మాట్లాడుతూ.
చెక్ చేశా కానీ ఫోన్ లో ఏం పర్సనల్స్ లేవు, ఏం దొరకలేదని నవ్వుతూ చెబుతుంది.హహహ మరీ దొరికేలాగా పెడతామా ఏంటి? అంటూ రాజీవ్ ఫన్నీ సెటైర్ వేస్తాడు. రాజీవ్( Rajiv ) కారణంగా ఏమైనా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? అని అడగ్గా అవును ఉన్నాయి.నేను గర్భవతిగా ఉన్నప్పుడు రాజీవ్ బయటికెళ్లేటప్పుడు మళ్లీ ఎప్పుడొస్తావని అడిగేదాన్ని ఎప్పుడు అడిగినా 5 మినిట్స్ లో వచ్చేస్తా అని చెబుతాడు అని తెలిపింది సుమ.అలాగే దెయ్యాల సినిమాలు ఎక్కువగా చూపించేవాడని, తను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు కూడా ఎక్కువగా దెయ్యాల సినిమాలన్నీ చూపించినట్లు చెప్పుకొచ్చింది సుమ.







