ఇంతకీ ఉగాదికి టైటిల్ రివీల్ ఉందా.. లేదా.. ఫ్యాన్స్ వెయిటింగ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ) నుండి సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ లో ఒకలాంటి క్రేజ్ అయితే ఉంటుంది.ఈయన సినిమా ఏంటి కొత్తగా చేస్తున్న సినిమా నుండి అప్డేట్ కోసం కూడా ఎంతగానో ఎదురు చూస్తుంటారు.

 Ssmb28 Movie Latest Update, Ssmb28, Mahesh Babu, Trivikram, Ssmb28 Title, Tollyw-TeluguStop.com

మరి టాలీవుడ్ లో ప్రజెంట్ తెరకెక్కుతున్న పలు క్రేజీ కాంబోల్లో మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram ) కాంబో ఒకటి.ఈ కాంబోలో ప్రస్తుతం హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతుంది.

మహేష్ బాబు కెరీర్ లో 28వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉన్నాయి.SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ప్రెజెంట్ ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో త్రివిక్రమ్ ఈ సినిమాను ప్లాన్ చేసారు.

ఈ సినిమా షూట్ కూడా పూర్తి కాకుండానే రైట్స్ ను భారీ డీల్ కు సొంతం చేసుకున్నారు.ప్రజెంట్ హైదరాబాద్ లో మహేష్, పూజా హెగ్డే ( Pooja Hegde ) మీద లవ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారని సమాచారం.ఇదిలా ఉండగా ఉగాదికి ఈ సినిమా టైటిల్ రివీల్ కాబోతుంది అని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.మరి దీని కోసం సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

అసలు అప్డేట్ ఉందా? లేదా? అనే దాని కోసం ఫ్యాన్స్ వెయిటింగ్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్( Pooja Hegde ) లుగా నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తుండగా.ఆగస్టు 11న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుంది వేచి చూడాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube