టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు అంటూ రెండు మూడు వారాలుగా తెగ ప్రచారం జరిగింది.కాని చివరకు కొత్త సంవత్సరం కానుకగా జక్కన్న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయలేదు.
దాంతో అంతా కూడా తీవ్రంగా నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.ఇదే సమయంలో కొందరు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం షూటింగ్ ఇంకా చాలా ఉందని, అందుకే ఇప్పటి నుండే పోస్టర్స్‌ను విడుదల చేయడం వల్ల విడుదల సమయంకు ఆసక్తి ఉండదని భావించి రాజమౌళి ఫస్ట్‌లుక్ విడుదల చేయలేదు అంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించుకుంటున్నారు.

ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం గురించి మీడియాలో వస్తున్న ఈ పుకారు పిచ్చి పుకారు.అది ఖచ్చితంగా నూటికి నూరు శాతం నిజం కాదు.ఎందుకంటే ఇప్పటికే ఆ చిత్రం 85 నుండి 90 శాతం వరకు పూర్తి అయినట్లుగా జక్కన్న ఆ మద్య సన్నిహితుల వద్ద చెప్పాడు.వచ్చే నెలతో సినిమా షూటింగ్ పూర్తి కాబోతుంది.
ఎట్టి పరిస్థితుల్లో జులై 30న సినిమాను విడుదల చేయబోతున్నారు.ఇంకా ఏడు నెలల సమయం ఉంది.
ఇంత సమయంలో జక్కన్న బ్యాలన్స్ వర్క్ పూర్తి చేసి పోస్ట్ ప్రోడక్షన్ పూర్తి చేయలేడా అంటూ సినీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు.

అన్ని అనుకున్నట్లుగా జరుగుతున్నాయని, తప్పకుండా ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం వాయిదా పడబోతుంది అంటే మీరు నమ్మవద్దంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఫ్యాన్స్‌కు సూచిస్తున్నారు.మెగా మరియు నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడా అంటూ అంతా ఉత్సాహంతో ఉన్నారు.
ఖచ్చితంగా వచ్చే సమ్మర్ చివర్లో జులై 30న విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.







