ప్రెజెంట్ మన టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తుంది.స్టార్ హీరోల కెరీర్ లో సూపర్ హిట్ అయిన సినిమాలను ఫ్యాన్స్ కోసం ప్రత్యేకంగా రీరిలీజ్ చేయడం జరుగుతుంది.
ఈ రీ రిలీజ్ కు వేరే లెవల్ లో రెస్పాన్స్ లభిస్తుంది.ఇప్పటికే మన టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి.
స్టార్ హీరోల వింటేజ్ చిత్రాలు రీ రిలీజ్ అవుతూ కోట్ల రూపాయలను వసూళ్లు చేస్తున్నాయి.
ఇక తాజాగా మరో స్టార్ హీరో చిత్రం రీ రిలీజ్ కు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ సినిమా ‘సింహాద్రి’. మరి ఈ బ్లాక్ బస్టర్ సినిమా రీ రిలీజ్ ప్లానింగ్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి.
ఈ సినిమా 4కే వర్షన్ లో అప్డేట్ చేసి ప్రింట్ సిద్ధం చేస్తున్నారు.ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా రీ రిలీజ్ డెఫినెట్ గా రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు రాబడుతుంది అని అంటున్నారు.

ఈ సినిమాను మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా రీ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ సినిమా రీ రిలీజ్ తో పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తుంది.ఇక ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ను తెచ్చుకున్న ఎన్టీఆర్ ప్రెజెంట్ తన 30వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.ఈ సినిమా డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వైట్ చేస్తున్నారు.అయితే వీరి ఎదురు చూపులకు ఫలితం ఇంకా రాలేదు.ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్న ఈ సినిమాను ఇంకా సెట్స్ మీదకు కూడా తీసుకు వెళ్ళక పోవడంతో అంతా తీవ్ర నిరాశలో ఉన్నారు.ఇప్పటి వరకు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా ఎటువంటి అప్డేట్ లు ఇవ్వలేదు.2024లో ఈ సినిమా రిలీజ్ చేస్తామని పోస్టర్ ద్వారా ఇటీవలే ప్రకటించారు.ఇక ఈ సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇంకా యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మిస్తున్నారు.