దేశంలో అత్యధికంగా మాంసాహారులు ఉన్న రాష్ట్రాలు ఇవే

ముక్క లేనిదే ముద్ద దిగదు, ఒక పాపులర్ సినిమాలో డైలాగ్ ఇది.తెలంగాణ ప్రజలకు కరెక్టుగా సరిపోతుంది.

 Srs Survey : Telangana Is India’s Most Non-vegetarian State-TeluguStop.com

ఎందుకంటే భారతదేశంలో అత్యధిక మాంసాహారులు ఉన్న రాష్ట్రం తెలంగాణే.సాంపుల్ రిజస్ట్రేషన్ సిస్టమ్ చేసిన సర్వేలో తేలింది ఈ విషయం.

ఆ సర్వే ఫలితాలని రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటివలే విడుదల చేసింది.

భారతదేశం మొత్తంలో 71% మంది మాంసాహారాన్ని తింటున్నారు.

మిగిలిన 29% మంది మాత్రమే శాఖహారం తీసుకుంటున్నారు.ఇక అత్యధిక మాంసాహారులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు.ఇక్కడి ప్రజల్లో 98.70% మంది మాంసాహారులే అంట.వెస్ట్ బెంగాల్ 98.55%, ఒరిస్సా 97.35, కేరళ 97% శాతంతో తరువాతి స్థానాల్లో నిలిచాయి.

ఇక అతి తక్కువ మాంసాహారులున్న రాష్ట్రం రాజస్థాన్.ఇక్కడ 25.10% ప్రజలు మాత్రమే మాంసాహారన్ని తింటున్నారట.హర్యానా, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్‌లో కూడా అధికశాతం మంది శాఖాహారులే.

బిర్యాని సంస్కృతి వలనో, ఆదివారం పూట ఒంట్లో ముక్క పడే అలవాటు వలనో కాని, తెలంగాణ రాష్ట్రంలో, ప్రతి వందమందిలో ఒకరో, ఇద్దరో మాత్రమే మాంసహారాన్ని ముట్టట్లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube