హమ్మయ్యా.. మొత్తానికి ఇన్ని రోజులకు శ్రీనిధికి ఆఫర్లు వచ్చాయిగా?

తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ శ్రీనిధి శెట్టి( Srinidhi Shetty ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

శ్రీనిధి శెట్టి పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా కేజిఎఫ్.

ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఈ సినిమా ఆమెకు మొదటి సినిమా అన్న విషయం మనందరికీ తెలిసిందే.

కేజిఎఫ్ తరువాత కేజీఎఫ్ 2 మూవీ కూడా విడుదల అయిన విషయం తెలిసిందే కేజీఎఫ్ 2( KGF 2 ) పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా దేశమంతా బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది.అంత పెద్ద హిట్స్ అందుకున్న ఈ భామకి తెలుగు, తమిళ, హిందీ భాషల నుంచి ఆఫర్ల మీద ఆఫర్లు వస్తాయని భావించారు.

కానీ ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది.ఇక రెండో చిత్రంగా ఆమె తమిళ్ లో విక్రమ్ సరసన కోబ్రా( Cobra ) అనే సినిమా చేసింది.ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.అంతే ఆమెకి అవకాశాలు మృగ్యం అయ్యాయి.2018లో కేజీఎఫ్ విడుదలైతే ఆమె ఇప్పటివరకు చేసిన చిత్రాలు మూడు మాత్రమే.దాదాపుగా ఆమె కెరీర్ ఎండ్ అయిందా అన్న అనుమానాలు వచ్చాయి.

Advertisement

ఇక అభిమానులు కూడా ఆమె కెరిర్ ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో తాజాగా ఆమెకు రెండు సినిమా అవకాశాలు వచ్చాయి.శ్రీనిధి తాజాగా తెలుగులో అడుగుపెడుతోంది.ఆమె నటిస్తున్న మొదటి తెలుగు చిత్రం తెలుసు కదా.

ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా మొదలైంది.ఇందులో సిద్దు జొన్నలగడ్డ ( Siddu jonnalagadda )హీరోగా నటిస్తున్నారు.రాశి ఖన్నాతో పాటు శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

ఇక కన్నడ లోనే సుదీప్ సరసన #కిచ్చా47 చిత్రం కూడా సైన్ చేసింది.ఇలా ఒకేసారి రెండు చిత్రాలు దక్కాయి.

ఇన్నాళ్లకు ఆమె కెరీర్ లో బిజీ అవుతోంది.అయితే కేజీఎఫ్ బ్యూటీకి అవకాశాలు వెల్లువెత్తుతాయి అని భావించిన అభిమానులు అసలు అవకాశాలు రాకపోవడంతో ఆశ్చర్య వ్యక్తం చేశారు.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...

ఇప్పుడిప్పుడే ఈ ముద్దు గుమ్మ కెరిర్ ట్రాక్ లో పడడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు