పెళ్ళికాని సెలబ్రిటీలు కనిపిస్తే చాలు పెళ్లెప్పుడు.పెళ్లెప్పుడు.
అంటూ జనాలు, రిపోర్టర్లు తెగ అడిగి విసిగిస్తూ ఉంటారు.అదేంటో కానీ వారు పెళ్లి గురించి చెప్పడానికే ఇష్టపడరు.
అసలు వాళ్లకు పెళ్లి చేసుకోవాలని ఉంటుందా.లేదా.
అనే అనుమానాలు కూడా వస్తుంటాయి వాళ్ళ సమాధానాలు చూస్తుంటే.ఇప్పటికి చాలామంది పెళ్లిళ్ల గురించి ప్రశ్న ఎదురైనప్పుడు ఏదో ఒక విషయంతో దాన్ని అక్కడికే పుల్ స్టాప్ పెట్టేవాళ్ళు.
మళ్లీ పెళ్లి గురించి అడగకుండా చేసేస్తుంటారు.అలా శ్రీముఖి కూడా చాలాసార్లు ఈ విధంగానే చేసింది.
కానీ ఇంత కాలానికి ఈమె పెళ్లి చేసుకునేది ఒక వ్యక్తిని అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఇంతకు ఆ వ్యక్తి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీముఖి( Sreemukhi ) గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రస్తుతం బుల్లితెరపై ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతుంది.కేవలం ఒక్క ఛానలే కాదు అన్ని ఛానల్స్ లలో ఓ రేంజ్ లో సందడి చేస్తుంది.గతంలో వెండితెరపై కూడా అవకాశానందుకొని కొన్ని సినిమాలలో చేసింది.నటనపరంగా కూడా శ్రీముఖికి మంచి మార్కులు వచ్చాయి.కానీ ఇప్పుడు పూర్తిగా బుల్లితెర పైన సెటిల్ అయింది.
వరుస సోలు చేస్తూ తీరిక లేకుండా సమయాన్ని గడుపుతుంది.ప్రస్తుతం బుల్లితెర ఆల్రౌండర్ గా ఒక ట్యాగ్ సొంతం చేసుకుంది.
ఈమె ఎనర్జీ కూడా మామూలుగా ఉండదని చెప్పాలి.కాస్త సమయం దొరికితే చాలు సోషల్ మీడియా( Social media )లో బాగా హడావుడి చేస్తూ ఉంటుంది.
ప్రతిరోజు ఫోటోషూట్లు చేయించుకుంటూ ఉంటుంది.ఒక్క రోజైనా తినకుండా ఉంటుందేమో కానీ తన ఫోటోలు పంచుకోకుండా మాత్రం అస్సలు ఉండదు.
ప్రతిరోజు తన షో స్ కు సంబంధించిన లుక్స్ తో ఫోటోషూట్( Photoshoot ) చేయించుకుంటూ ఉంటుంది.బాగా అందాల విందు వడ్డిస్తూ ఉంటుంది.ఇక పొట్టి పొట్టి బట్టలతో పాటు ట్రెడిషనల్ లుక్ లో కూడా దర్శనమిస్తూ ఉంటుంది.ఇక ఎప్పుడు చూసినా ఒకే రకమైన స్టిల్స్ ఇస్తూ చూసే వాళ్లకు బాగా బోరింగ్ తెప్పిస్తూ ఉంటుంది.
కానీ తనకు మాత్రం అసలు బోర్ రాదని చెప్పాలి.ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ కు.ఫోటోలు తీయించుకునే తనకు అసలు బోర్ కొట్టదు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇన్స్టాల్ లో మరికొన్ని ఫొటోస్ పంచుకుంది.
అందులో ఎల్లో కలర్ డ్రెస్ లో బోరింగ్ స్టిల్స్ తో కనిపించింది.అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఎప్పుడు చేసే విధంగానే కామెంట్లు చేశారు.కాస్త స్టీల్స్ అయినా మార్చు.లేదా కొంతకాలం ఫోటోషూట్లకు గ్యాప్ అయిన ఇవ్వు.ఏంటి మాకు ఈ టార్చర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.అయితే మరి కొంతమంది శ్రీముఖి చివరికి పెళ్లి చేసుకునేది ఫోటోగ్రాఫర్ నే అంటూ సరదాగా కామెంట్లు చేశారు.
దీంతో కొందరు చివరికి శ్రీముఖికి ఫోటోగ్రాఫర్ తోనే పెళ్లి అవుతుంది.ఇక పెళ్లి చేసుకున్నాక రోజంతా ఫోటోలు దిగొచ్చు అని శ్రీముఖి పెళ్లి గురించి బాగా చర్చలు చేస్తున్నారు.