టాలీవుడ్ లో ప్రస్తుతం సూపర్ ఫాం లో ఉన్న హీరోయిన్ ఎవరంటే వినిపించే పేరు శ్రీ లీల( Sreeleela ).కన్నడ నుంచి వచ్చిన అమ్మడు తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.
పెళ్లిసందడి, ధమాకా రెండు సినిమాలతోనే వరుసగా ఎనిమిది సినిమాలు ఛాన్స్ అందుకుంది.స్టార్స్, యువ హీరోలు అందరినీ కవర్ చేస్తూ కెరీర్ లో ఫుల్ జోష్ చూపిస్తుంది శ్రీ లీల.ఇలాంటి టైం లో అమ్మడు కొత్త హీరోతో సినిమా చేస్తుందా అన్న డౌట్ మొదలైంది.గల్ల జయదేవ్ హీరోగా ఆల్రెడీ పరిచయమయ్యాడు.
మహేష్ మేనల్లుడు ఇప్పటికే ఓ సినిమా చేశాడు.
ఇక ఇప్పుడు గల్లా జయదేవ్( Jayadev Galla ) రెండో కుమారుడు సిద్ధార్థ్ గల్ల( Siddharth Galla ) హీరోగా పరిచయం కాబోతున్నాడట.
ఇప్పటికే ఓ డైరెక్టర్ ని ఫిక్స్ చేయడం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టడం అంతా జరిగిందట.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది.
శ్రీ లీల అయితే ఆమె ఫాలోయింగ్ సినిమాకు ప్లస్ అవుతుందని.సినిమా కచ్చితంగా ఆడియన్స్ కు రీచ్ అవుతుందని భావిస్తున్నారట.
మరి వరుస సినిమాలు చేస్తున్న శ్రీ లీల డెబ్యూ హీరోతో సినిమా అంటే ఒప్పుకుంటుందా లేదా అన్నది చూడాలి.








