Kota Bommali PS Review: కోటబొమ్మాళి పీఎస్ రివ్యూ అండ్ రేటింగ్

ప్రస్తుత కాలంలో ఎంతో విభిన్నమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి.ఇకపోతే ఈ మధ్యకాలంలో సస్పెన్స్ జానర్ లో తెరకెక్కిన సినిమాలకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.

 Srikanth Varalaxmi Sarath Kumar Shivani Rajasekhar Rahul Vijay Kotabommali Ps M-TeluguStop.com

ఇక ఇదే చానల్లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం కోటబొమ్మాలి పిఎస్(Kota Bommali PS).రాహుల్ విజయ్(Rahul Vijay), శివాని రాజశేఖర్(Shivani Rajasekhar) ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమాలో నవంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమాలో శ్రీకాంత్ వరలక్ష్మి శరత్ కుమార్ వంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు.అసలు ఈ సినిమా కథ ఏంటి? ఈ సినిమా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే.

కథ:

కోటబొమ్మాలి అని పోలీస్ స్టేషన్లో ఉండి పోలీసులు రాజకీయ నాయకుల వికృత చేష్టలకు అణచివేయబడి ఉంటారు చేయని తప్పక కూడా వాళ్ళు నేరం మోసుకోవాల్సి వస్తుంది.ఇక ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి ముగ్గురు పోలీసులు అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది.

అలా శ్రీకాంత్, ( Srikanth ) రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ముగ్గురు కలిసి పోలీసుల నుంచి తప్పించుకుంటూ తిరగాల్సిన పరిస్థితి వస్తుంది పోలీసులకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఈ సినిమా కథ ఇక అజ్ఞాతంలో ఉన్నటువంటి ఈ పోలీసులను పట్టుకోవడానికి మరొక పోలీస్ ఆఫీసర్ అయినటువంటి వరలక్ష్మి శరత్ కుమార్( Varalaxmi Sarath Kumar ) రంగంలోకి దిగుతారు.ఇలా పోలీసులే అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి కారణం ఏంటి అసలు రాజకీయ కారణంగా పోలీసులు ఎందుకు ఇబ్బంది పడ్డారు అనే విషయం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.

Telugu Kotabommaali Ps, Kotabommaalips, Kotabommali Ps, Kotabommalips, Murali Sh

నటీనటుల నటన:

శ్రీకాంత్ తన పాత్ర వరకు చాలా అద్భుతంగా నటించడమే కాకుండా ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ లో చాలా రోజుల తర్వాత యాక్టింగ్ లో తన డెప్త్ ని చూపించాడు.మురళీ శర్మ( Murali Sharma ) యాక్టింగ్ సినిమాకు ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి.ఇక వరలక్ష్మి శరత్ కుమార్ కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.ఇలా ప్రతి ఒక్కరు కూడా వారి పాత్రలకు 100 శాతం న్యాయం చేశారు.

Telugu Kotabommaali Ps, Kotabommaalips, Kotabommali Ps, Kotabommalips, Murali Sh

టెక్నికల్:

రంజన్ రాజు మ్యూజిక్ ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎంతో అద్భుతంగా ఉందని చెప్పాలి.స్క్రీన్ ప్లే ద్వారానే సినిమాలు హిట్ అవుతాయి అని చెప్పడానికి ఈ సినిమా కూడా ఉదాహరణ.డైరెక్టర్ కూడా ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఎంతో అద్భుతంగా చూపించారు.బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫోటోగ్రఫీ చాలా ప్లస్ పాయింట్ అయ్యాయని చెప్పాలి.

విశ్లేషణ:

సినిమాని ఆద్యంతం ఉత్కంఠ గా తీసుకెళ్లినప్పటికీ ఈ సినిమా మాత్రం కొన్ని సీన్లలో అవుట్ ఆఫ్ ది మూవీగా వెళ్ళింది.ఇక ఈ సినిమాలో పోలీసుల్ని పోలీసులు తరమడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఇక సినిమాలో అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బోర్ కొట్టేలాగే ఉన్నాయి.

Telugu Kotabommaali Ps, Kotabommaalips, Kotabommali Ps, Kotabommalips, Murali Sh

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, మ్యూజిక్, లింగిడి లింగిడి అనే సాంగ్.

మైనస్ పాయింట్స్:

పోలీసుల్ని పోలీసులు తరమడం కాస్త సినిమాకు మైనస్ అయింది, చేజింగ్ సన్నివేశాలు.

బాటమ్ లైన్:

ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు( Suspense Thriller ) ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.అయితే ఇందులో పోలీసులని తరమటం ఆశ్చర్యానికి గురి చేసింది.ఈ సినిమాని ఎలాంటి బోర్ లేకుండా ఒకసారి చూడవచ్చు.

రేటింగ్: 2.5/5

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube