'హలో బ్రదర్' చిత్రం లో నాగార్జున కి డూప్ గా నటించిన స్టార్ హీరో అతనేనా..! ఇన్ని రోజులు తెలియలేదుగా!

టాలీవుడ్ లో కొన్ని చిత్రాలు సరికొత్త ట్రెండ్ ని సృష్టిస్తాయి, ఆ ట్రెండ్ ని ఫాలో అవుతూ వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి.మన టాలీవుడ్ లో మొట్టమొదటి ద్విపాత్రాభినయం ని ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం ‘రాముడు – భీముడు‘.

 Srikanth As A Doop Of Nagarjunain Hello Brother Movie, Hello Brother , Nagarju-TeluguStop.com

ఎన్టీఆర్ ని హీరో గా పెట్టి రామానాయుడు నిర్మించిన ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.ఈ సినిమా తర్వాత ఎన్నో ద్విపాత్రాభినయం ఉన్న సినిమాలు వచ్చాయి, సక్సెస్ లు సాధించాయి.

కొన్ని చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి కూడా, ఒకానొక్క సమయం లో ద్విపాత్రాభినయం తో కూడిన సినిమాలు ఎక్కువై, ఆడియన్స్ కి బోర్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి.అలాంటి సమయం లో ‘డ్రాగన్’ అనే ఇంగ్లీష్ చిత్రాన్ని రీమేక్ చెయ్యడానికి ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ( EVV Satyanarayana )సిద్ధం గా ఉన్నాడు.

Telugu Brother, Nagarjuna, Ramya Krishna, Soundarya, Srikanth, Tollywood-Movie

అక్కినేని నాగార్జున ( Nagarjuna )ని హీరో గా అనుకున్నాడు.పాత ఫార్ములా అయినా ద్విపాత్రాభినయం నే తీసుకొని సరికొత్త పద్దతి ప్రేక్షకులకు కొత్తగా అనిపించేలా ఈ చిత్రానికి తెరకెక్కించాడు.దానికి తోడు అద్భుతమైన కామెడీ ని జత చేసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ అప్పట్లో ఒక చరిత్ర తిరగరాసింది.సుమారుగా 9 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, కేవలం లక్షల తేడా తోనే ఇండస్ట్రీ హిట్ అయ్యే ఛాన్స్ ని పోగొట్టుకుంది.

ఇక ఈ చిత్రం లో హీరోయిన్స్ గా సౌందర్య మరియు రమ్య కృష్ణ నటించగా, రంభ స్పెషల్ సాంగ్ చేసింది.ఈ చిత్రం లోని పాటలు కూడా అప్పట్లో ఆంధ్ర యూత్ మరియు మాస్ ఆడియన్స్ ని ఒక్క ఊపు ఊపేసింది.

అయితే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ అప్పట్లో లేదు.ద్విపాత్రాభినయం చెయ్యాల్సి వచ్చినప్పుడు, సదరు హీరో కి దగ్గర పోలికలు ఉన్న ఆర్టిస్టులను నటింపచేసి, ఆ తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా తమకి అనుకూలంగా మార్చుకునేవాళ్ళు./br>

Telugu Brother, Nagarjuna, Ramya Krishna, Soundarya, Srikanth, Tollywood-Movie

పాత కాలం లో సీనియర్ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన సినిమాల్లో రెండవ ఎన్టీఆర్ గా కైకాల సత్యనారాయణ నటించేవాడు.ఇక ‘హలో బ్రదర్’ చిత్రం సమయానికి అక్కినేని నాగార్జున కు చాలా దగ్గర పోలికలు ఉన్న శ్రీకాంత్ ( Srikanth )ని రెండవ నాగార్జున గా చాలా సన్నివేశాల వరకు నటింపచేశారట.ఆ తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా నాగార్జున ముఖాన్ని మార్చి, ద్విపాత్రాభినయం లెక్క చిత్రీకరించారట.అయితే అన్నీ సన్నివేశాలకు కాకుండా కేవలం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలకు మాత్రమే శ్రీకాంత్ ని వాడుకున్నారట.

ఈ విషయాన్నీ అప్పట్లో ఈవీవీ సత్యరనారాయణ స్వయంగా చెప్పుకొచ్చాడు.అలా ఎన్నో ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికీ కూడా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది.

టీవీలలో వచ్చినప్పుడల్లా మంచి టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకుంటూ ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube