సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వాళ్లకంటూ సపరేట్ గుర్తింపు కోసం కొన్ని సినిమాల్లో నటిస్తూ ఉంటారు. డైరెక్టర్ గానే కాకుండా నటులు అవుదామని ఆలోచన కూడా ఉండటంతో వాళ్ల డైరెక్షన్ లో వచ్చిన కొన్ని సినిమాల్లోనే నటిస్తూ నటులుగా గుర్తింపును పొందుతూ అలా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది డైరెక్టర్లు వాళ్ల సినిమాల్లోనే నటించి నటులుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి వారు ఎవరో ఒక్కసారి మనం కూడా తెలుసుకుందాం.

మొదటగా దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) గారి గురించి చూసుకుంటే ఈయన రైటర్ గా ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత డైరెక్టర్ గా సినిమాలు తీసి మంచి విజయాలను అందుకున్నాడు.ఇక ఈయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లో కొన్ని సినిమాల్లో ఆయనే స్వయంగా నటించి మెప్పించాడు.ఆయన చేసిన క్యారెక్టర్లు చాలా డీసెంట్ గా ఉంటాయి.అందువల్ల ఆ సినిమాల్లో ఈజీగా నటించేవాడు ఇక ఆ తర్వాత ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాల్లోనే కాకుండా బయటి వాళ్ల సినిమాల్లో కూడా ఆయన నటించాడు అందుకే ఆయనకి ఇండస్ట్రీలో డైరెక్టర్ గా నటుడిగా మంచి గుర్తింపు ఉంది.

ఈయన తర్వాత రీసెంట్ గా పెదకాపు అనే సినిమా( Peddha Kapu Movie )లో కూడా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ( Srikanth addala )నటించాడు.ఈ సినిమా డైరెక్టర్ అయిన శ్రీకాంత్ అడ్డాల కూడా ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటించి మెప్పించడం జరిగింది.ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని దూసుకెళ్తుంది.ఈయన ఇప్పటికే చాలా సినిమాలు డైరెక్షన్ చేసినప్పటికీ అందులో కొన్ని సక్సెస్ అయిన మరికొన్ని మాత్రం పెద్దగా సక్సెస్ అయితే అవ్వలేదు.
దాంతో తను నటుడిగా కూడా మారినట్టుగా తెలుస్తుంది.అయితే ఇంతకు ముందు శ్రీకాంత్ అడ్డాల చేసిన సినిమాలు అన్నీ కూడా క్లాస్ సినిమాలు కావడం ఈ సినిమా మాత్రం ఒక విలేజ్ లో సాగే స్టోరీ కావడం అది కూడా మంచి రాజకీయ నేపధ్యం ఉన్న సినిమా కావడం ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండటం కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది.
ఇక ఈ సినిమా ఇవాళ్ల రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకొని ముందుకు వెళుతుంది…
.