Sri Reddy Nara Brahmani: నారా బ్రాహ్మణి వ్యాఖ్యలపై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన శ్రీ రెడ్డి… అప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటూ?

Sri Reddy Fires On Nara Brahmani

చంద్రబాబు నాయుడు(Chandrababu ) అరెస్టు కావడంతో కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు.అలాగే తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు కూడా చంద్రబాబు అరెస్టులతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 Sri Reddy Fires On Nara Brahmani-TeluguStop.com

ఈ క్రమంలోనే నారా బ్రాహ్మిని(Brahmini) చంద్రబాబు అరెస్టు విషయం గురించి మాట్లాడిన విషయాలు మనకు తెలిసిందే.ఎలాంటి ప్రూఫ్ లేకుండా చంద్రబాబు నాయుడుని కేవలం కక్ష సాధింపు చర్యలలో భాగంగానే అరెస్టు చేశారు అంటూ ఈమె తెలియజేశారు.

చంద్రబాబు నాయుడు తీసుకువచ్చిన పథకాల ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు అలాంటి వారిలో నేను కూడా ఒకదానినేనని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేయడం తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.

ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో లోకేష్ గారు ఢిల్లీ వెళ్లారు నేను రాజమండ్రి విజయవాడ మధ్య తిరుగుతున్నాను ఎప్పుడు బయటికి రానటువంటి మా అత్తమ్మ ఈరోజు బయటకు వచ్చారు.

ఇక నా ఎనిమిది సంవత్సరాల కుమారుడు దేవాన్ష్ ఒంటరిగా ఉన్నారు స్కూల్ కి వెళ్ళిపోతున్నారు ఇలా కుటుంబం మొత్తాన్ని ఈ విధంగా బాధ పెడుతున్నారు అంటూ బ్రాహ్మిని మాట్లాడారు.అయితే బ్రాహ్మిని చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై ఫైర్ బ్రాండ్ శ్రీరెడ్డి(Sri Reddy) రంగంలోకి దిగారు.

Telugu Chandra Babu, Chandrababu, Jagan, Brahmani, Brahmani Sri, Lokesh, Sri Red

ఈ సందర్భంగా బ్రాహ్మిని వ్యాఖ్యలకు శ్రీ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్టు కావడంతో దేవాన్సు ఒంటరి అయ్యారు అని నువ్వు తెగ బాధపడుతున్నావు.దేవాన్ష్ కి అరెస్ట్ అయినది ఒక తాత.తాత అవసరం తనకు లేకపోవచ్చు కానీ ఒకానొక సమయంలో జగనన్న(Jagan) అరెస్ట్ అయ్యారు.ఆయన ఇద్దరు ఆడపిల్లల తండ్రి మరి ఆ ఆడపిల్లల పరిస్థితి ఏంటి అని నువ్వు ఆరోజు ఆలోచించలేదా అంటూ ఈమె సూటి ప్రశ్న వేశారు.ఎప్పుడు బయటకు రాని మా అత్త బయటకు వచ్చింది అని చెబుతున్నావు

Telugu Chandra Babu, Chandrababu, Jagan, Brahmani, Brahmani Sri, Lokesh, Sri Red

మీడియా అంటే కూడా ఏంటో తెలియని విజయమ్మ ఆరోజు కొడుకు కోసం రోడ్డుపైకి రాలేదా ఆరోజు నువ్వు ఏం చేస్తున్నావ్ అంటూ ప్రశ్నించారు.భర్తను పోగొట్టుకొని ఒకరు భర్త జైల్లో వేయడంతో మరొకరు తండ్రిని జైల్లో పెడితే ఆ ఆడపిల్లలు అందరూ నడిరోడ్డుపై కూర్చుంటే పోలీసుల చేత వారిని పక్కకు లాగించేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు.ఇప్పుడు స్కామ్ లో భాగంగా పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికిపోయి రాజమండ్రి జైలుకు( Rajahmundry Jail ) వెళ్లిన చంద్రబాబు గురించి ఇంతలా బాధపడుతున్నావే ఆయన అవినీతి చేసేటప్పుడు ఇలా చేయడం తప్పు మామయ్య అని ఒక్క మాట చెప్పలేవా అంటూ శ్రీరెడ్డి బ్రాహ్మినిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telugu Chandra Babu, Chandrababu, Jagan, Brahmani, Brahmani Sri, Lokesh, Sri Red

ఇక చంద్రబాబు నాయుడు అరెస్టయి మన రాష్ట్రంలో ఇన్ని జైల్లు ఉండగా కేవలం రాజమండ్రి జైలుకే ఎందుకు వెళ్లారో తెలుసా పుష్కరాల సమయంలో ఈయన పిచ్చి ఫోటోషాట్ల కారణంగా తొక్కిసలాటలో భాగంగా 30 మందికి పైగా చనిపోయారు వారందరి ఆత్మఘోష చంద్రబాబు నాయుడుని రాజమండ్రి జైలుకు వెళ్లేలా చేసిందని ఆయన కట్టించిన స్నేహ బ్లాక్ లోనే ఆయన ఇప్పుడు బందీగా ఉన్నారు అంటూ ఈ సందర్భంగా శ్రీ రెడ్డి ఓ రేంజ్ లో బ్రాహ్మినికి రివర్స్ కౌంటర్ ఇచ్చి పడేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube