శ్రీరామనవమి స్పెషల్.. వెండితెరపై శ్రీరాముని పాత్ర పోషించి మెప్పించిన నటులు వీళ్లే!

తెలుగులో ఇప్పటికే రామాయణం, రాముడు ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కిన విషయం తెలిసిందే.ఎన్టీఆర్‌ నుంచి ప్రభాస్‌ ( Prabhas , NTR ) వరకు పలువురు స్టార్‌ హీరోలు రాముడి పాత్రలు పోషించి మెప్పించారు.

 Sri Rama Navami 2024 List Tollywood Actors Who Impressed Playing Lord Rama Role,-TeluguStop.com

ఇకపోతే నేడు అనగా ఏప్రిల్‌ 17 శ్రీరామనమవి.మరి ఈ సందర్భంగా రామాయణం నేపథ్యంలో వచ్చిన సినిమాలు, రాముడిగా మెప్పించిన హీరోలు ఎవరో ఇప్పుడు మనం తెలుసు కుందాం.

మొట్టమొదటిసారి టాలీవుడ్‌ తెరపై రాముడి పాత్ర పోషించింది యడవల్లి సూర్య నారాయణ.పాదుకా పట్టాభిషేకం( Paduka cpattabishekam ) సినిమాలో సూర్యనారాయణ రాముడిగా నటించి మెప్పించారు.

బాదామి సర్వోత్తం దర్శకత్వం వహించిన ఈ సినిమా 1932లో విడుదలై మంచి విజయం సాధించింది.తెలుగులో వచ్చిన రెండో టాకీ మూవీ.ఇదే టైటిల్‌తో 1945లో మరో సినిమా తెరకెక్కింది.ఇందులో సి.

ఎస్.ఆర్ ఆంజనేయులు( CSR Anjaneyu ) రాముడిగా నటించి మెప్పించారు.ఆ తర్వాత 1944లో వచ్చిన శ్రీ సీతారామ జననం సినిమా( Sri Sitarama Jananam movie )లో ఏఎన్నార్‌ శ్రీరాముడి పాత్ర పోషించారు.అలాగే శ్రీరాముడు పాత్రను ఎంతమంది పోషించినా అందరికి గుర్తిండేది మాత్రం ఒక్క ఎన్టీఆర్‌ మాత్రమే.వెండితెర రాముడు అనగానే అందరికి గుర్తొచ్చే రూపం ఎన్టీఆర్‌ మాత్రమే.1959లో విడుదలైన సంపూర్ణ రామాయణంతో తొలిసారి రాముడు గెటప్‌లో కనిపించాడు ఎన్టీఆర్‌.

Telugu Prabhas, Sri Rama Navami, Srirama, Tollywood-Movie

ఆ తర్వాత లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్దం సినిమాల్లో కూడా రాముడిగా కనిపించారు.కాగా సీనియర్ ఎన్టీఆర్‌ రాముడిగా నటించడమే కాకుండా రామాయణం నేపథ్యంతో వచ్చినఅనేక సినిమాలకు దర్శకత్వం వహించారు.1968లో వచ్చిన వీరాంజనేయ సినిమాలో కాంతారావు రాముడిగా కనిపించారు.1976లో దర్శకుడు బాపు తెరకెక్కించిన సీతా కల్యాణం లో రవికుమార్‌ రాముడిగా నటించారు. శోభన్‌ బాబు ( Shobhan Babu )కూడా రాముడి గెటప్‌లో ఆకట్టుకున్నాడు.బాపు దర్శకత్వంలోనే 1971లో వచ్చిన సంపూర్ణ రామాయణంలో టాలీవుడ్ సోగ్గాడు శోభన్‌బాబు రాముడి పాత్రలో నటించి మెప్పించారు.1997లో గుణశేఖర్‌ దర్శకత్వంలో వచ్చిన బాల రామాయణంలో జూనియర్‌ ఎన్టీఆర్ రాముడిగా కనిపించాడు.

Telugu Prabhas, Sri Rama Navami, Srirama, Tollywood-Movie

నాగార్జున నటించిన శ్రీ రామదాసు సినిమాలో సుమన్‌ రాముడిగా కనిపించి ఆకట్టుకున్నారు.కోడిరామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన దేవుళ్లు సినిమాలో ఒక పాటలో శ్రీకాంత్‌ కాసేపు రాముడిగా కనిపించి అలరించాడు.నందమూరి బాలకృష్ణ సైతంగా రాముడిగా నటించి మెప్పించాడు.బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యం సినిమాలో బాలయ్య ఎన్టీఆర్‌ పాత్రను పోషించాడు.2011లో వచ్చిన ఈ చిత్రంలో నయనతార సీతాగా నటించింది.ఆదిపురుష్‌ చిత్రంలో ప్రభాస్‌ రాముడిగా మళ్లీ తెలుగు తెరపై మెరిశాడు.ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రామాయణానికి ఆధునిక టెక్నాలజీతో ఈ మూవీని రూపొందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube