పెళ్లి సందడి సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీ లీలా.ఈ అమ్మడు మొదటి సినిమా తో నిరాశ పరిచినా కూడా వెంట వెంటనే సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంటుంది.
తాజాగా మాస్ మహారాజా రవితేజ నటించిన ధమాకా సినిమా లో ఈ అమ్మడు హీరోయిన్ గా నటించి మెప్పించింది.రవితేజ ధమాకా సినిమా కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.
అంతే కాకుండా సినిమాలోని శ్రీ లీలా పాత్ర కు పాజిటివ్ టాక్ సొంతం అవ్వడంతో ఆమె కు వరుసగా తెలుగు సినిమాల్లో ఆఫర్స్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.సాధారణం గా మొదటి సినిమా నిరాశ పర్చితే ఆ తర్వాత సక్సెస్ దక్కినా కూడా పెద్దగా ఆఫర్స్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
కానీ శ్రీ లీలా విషయం లో మాత్రం ఆ విషయం తారు మారు అయింది.

మొదటి సినిమా డిజాస్టర్ అయిన కూడా రెండవ సినిమా ధమాకా పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో వరుసగా ఆఫర్స్ దక్కుతున్నాయి.ఇటీవల ప్రముఖ నిర్మాత ఒకరు శ్రీ లీలాకు దాదాపు పాతిక లక్షల రూపాయల అడ్వాన్స్ ఇచ్చేసారట.ఆయన ఒక స్టార్ హీరోతో నిర్మించబోతున్న సినిమా కోసం శ్రీ లీలా ను కన్ఫర్మ్ చేయడం జరిగిందట.
త్వరలోనే బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రూపొందుతున్న మరో సినిమా లో కూడా ఈమె నటించబోతోంది.అయితే ఆ సినిమా లో హీరోయిన్ గా కాకుండా కీలక పాత్ర లో శ్రీ లీలా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.
ఇవే కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా చర్చల దశ లో ఉన్నాయి.ముందు ముందు స్టార్ హీరో లకు యంగ్ హీరోలకు ఈ ముద్దుగుమ్మ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకోవడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.







