యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికా లో ఉన్నాడు.కొరటాల శివ దర్శకత్వం లో రూపొందాల్సిన సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తోంది.
విశ్వసనీయంగా అందుకున్న సమాచారం ప్రకారం జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించేందుకు దర్శకుడు కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడట.ఈ లోపు హాలిడే ట్రిప్ కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి అమెరికా వెళ్ళాడు.
ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది.దాంతో అమెరికా లో కూడా ఎన్టీఆర్ కి ప్రశాంతత లేకుండా పోయిందట.
ఆయన సన్నిహితులు మరియు మిత్రుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అమెరికన్ మీడియా ఎన్టీఆర్ యొక్క ఇంటర్వ్యూ కోసం తెగ ప్రయత్నాలు చేస్తుందని.ఎక్కడ కనిపించినా కూడా అమెరికా లో జనాలు ఆయన తో ఫోటోలు దిగుతూ కాస్త ఇబ్బంది పెడుతున్నారట.

ఆ విషయమై ఎన్టీఆర్ కి ఇబ్బంది కలగడం తో అమెరికా లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఎలా అయితే అజ్ఞాతం లో ఉండి ముసుగులో తిరుగుతాడో అలాగే అమెరికా లో కూడా తిరుగుతున్నాడు అంటూ సమాచారం అందుతుంది.వచ్చే వారం లో అమెరికా నుండి తిరిగి రాబోతున్న ఎన్టీఆర్ అతి త్వరలోనే కొరటాల శివ దర్శకత్వం లో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు.కొరటాల శివ సినిమా తర్వాత కేజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఎన్టీఆర్ అత్యంత భారీ యాక్షన్ సినిమా ను చేసేందుకు రెడీ అవుతున్నాడు.అతి త్వరలోనే ప్రశాంత్ నీల్ అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేస్తాడని తెలుస్తుంది.
ఎన్టీఆర్ సినిమా కోసం గత ఆరు నెలలుగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా కూడా దర్శకుడు కొరటాల శివ మాత్రం స్క్రిప్ట్ విషయంలో ఎన్టీఆర్ ను ఒప్పించలేక పోయాడు.ఎట్టకేలకు ఎన్టీఆర్ ఓకే చెప్పాడట.







