తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బుల్లితెర యాంకర్ గా ఈమె అందరికీ సుపరిచితమే.
బుల్లితెరపై పలు షోలలో తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ తన మాటలతో అలరిస్తూ ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకుంది.ఇక ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో కుర్రకారు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.
ఒకవైపు యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూనే మరొకవైపు వెండితెరపై అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.
టాలీవుడ్ ఎనర్జిటిక్ యాంకర్ ఎవరు అనగానే శ్రీముఖి పేరు వినిపిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే శ్రీముఖి ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న బోళా శంకర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే నేను శైలజ ఇలాంటి సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.మోహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న బోళా శంకర్ సినిమా పై మెగాస్టార్ అభిమానులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు.
ఇకపోతే శ్రీముఖి ఈ మధ్యకాలంలో బుల్లితెర కి కాస్త గ్యాప్ ఇచ్చినప్పటికీ మళ్లీ తన యాంకరింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే యాంకర్ సుమ హోస్ట్గా వ్యవహరిస్తున్న క్యాష్ షోలో పాల్గొంది.శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా క్యాష్ షో లో పాల్గొన్న శ్రీముఖి సందడి సందడి చేసింది.ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.
ఈ షోలో యాంకర్ శ్రీముఖి మాట్లాడుతూ తన పర్సనల్ లైఫ్ గురించి అలాగే తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.ఈసందర్భంగా శ్రీముఖి ఎమోషనల్ గా మాట్లాడింది.

తాను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోందని, ఎందరో అందమైన హీరోలు, కో యాంకర్స్ తో కలిసి పని చేశానని చెప్పుకొచ్చింది.కానీ వారిలో ఎవరికీ నా మనసు ఇవ్వలేదు, ఇప్పటి వరకు నేను పెళ్లి చేసుకోలేదు.అయితే నేను పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఒక వ్యక్తి అని శ్రీముఖి తెలిపింది.ఆ వ్యక్తి పేరు చెప్పే లోపుగానే ప్రోమో ఎండ్ అవుతుంది.మరి శ్రీముఖి ఎవరి కోసం పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది.ఆ వ్యక్తి ఎవరో తెలియాలి అంటే మార్చి 9 వరకు వేచి చూడాల్సిందే మరి.ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ కాగా నేటిజన్స్ శ్రీముఖి చెప్పిన ఆ పర్సన్ ఎవరా అని ఆరా తీస్తున్నారు.







