అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ( Balakrishna ) హీరోగా కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal ) , శ్రీ లీల( Sreeleela ) హీరో హీరోయిన్లుగా నటిస్తున్నటువంటి చిత్రం భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) .ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, బాలయ్య కూతురి పాత్రలో శ్రీ లీల నటించబోతున్నారని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మరోవైపు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్( Unstoppable 3 )సీజన్ 3 కార్యక్రమంలో భాగంగా మొదటి ఎపిసోడ్ లో ఈ చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు.

మొదటి ఎపిసోడ్ లో భాగంగా భగవంత్ కేసరి టీం నుంచి డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు, శ్రీ లీల, కాజల్ అగర్వాల్ అర్జున్ రాంపాల్ హాజరయ్యి సందడి చేశారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించినటువంటి విషయాలను కూడా ప్రస్తావించారని తెలుస్తోంది.ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ గురువారం నుంచి ఆహాలో ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ శ్రీ లీలను ప్రశ్నిస్తూ అసలు భగవంత్ కేసరి సినిమాలో మీరు ఎందుకు నటించారు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు శ్రీ లీల సమాధానం చెబుతూ తాను పెళ్లి సందడి సినిమా చేసే సమయంలోనే ఈ సినిమా కథ తనకు చెప్పారని అయితే ఈ సినిమాలో తాను కూతురి పాత్రలో నటించాల్సి వస్తుందనే విషయం తెలియడంతో చాలామంది ఈ సినిమాలో నటించకు నో చెప్పేసే అంటూ తనకు సలహాలు ఇచ్చారు.అదే సమయంలో నాకు హీరోయిన్గా ఇతర సినిమాలలో కూడా అవకాశాలు వస్తున్నాయి.ఇలా హీరోయిన్గా అవకాశాలు అందుకుంటూ కూతురి పాత్రలో నటించడం అంటే కెరియర్ పై దెబ్బ పడుతుందని అందుకే వద్దని చాలామంది సలహా ఇచ్చారు.
అయితే హీరోయిన్ గా ఈ సినిమా కాకపోయినా ఇంకో సినిమా చేసే అవకాశం వస్తుంది.ఇలా కూతురి పాత్రలో చేసే అవకాశం నాకు రాకపోవచ్చు అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకూడదని ఈ సినిమాకు కమిట్ అయ్యాను అంటూ ఈ సందర్భంగా శ్రీ లీల తెలిపారు.
కెరియర్ పరంగా నేను తీసుకున్న బెస్ట్ నిర్ణయం ఏదైనా ఉందా అంటే అది ఈ సినిమాలో నటించడమే అంటూ ఈ సందర్భంగా ఈమె చెప్పిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







