సూపర్ స్టార్ మహేష్ బాబు( Superstar Mahesh Babu ) హీరోగా త్రివిక్రమ్ ( Trivikram ) దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా కు సంబంధించిన అప్డేట్ ఇటీవలే వచ్చింది.గుంటూరు కారం( Gunturu kaaram movie ) అనే టైటిల్ ను ఈ సినిమా కు ఖరారు చేయడంతో పాటు పోస్టర్ ను మరియు వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది.
ఇక ఈ సినిమా లో హీరోయిన్స్ గా పూజా హెగ్డే మరియు శ్రీలీల ( Sreeleela ) నటిస్తున్నారు.మొదట పూజా హెగ్డేను మాత్రమే ఎంపిక చేయడం జరిగింది.
ఆ తర్వాత శ్రీ లీల ను తీసుకున్నారు.సాధారణంగా త్రివిక్రమ్ సినిమా లో సెకండ్ హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత ఉండదు.
కనుక గుంటూరు కారం సినిమా లో పూజా హెగ్డే కు పెద్దగా ప్రాముఖ్యత ఉండక పోవచ్చు అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.సోషల్ మీడియాలో ప్రస్తుతం శ్రీ లీలకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అరడజను సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ శ్రీలీల సెకండ్ హీరోయిన్ పాత్రలు చేయాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు విమర్శిస్తున్నారు.మొత్తానికి శ్రీలీల వరుసగా సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో చిన్నా చితక పాత్రల్లో నటించేందుకు ఓకే చెప్పడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.శ్రీలీల మొదటి సినిమా పెళ్లి సందడి ఫ్లాప్ అయ్యింది.అయినా కూడా అదృష్టం కొద్ది వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.ఈ సమయంలో శ్రీ లీల కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.బాలయ్య కు కూతురుగా, మహేష్ సినిమా లో సెకండ్ హీరోయిన్ గా వంటి పాత్రల్లో నటించడం వల్ల కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా డ్యామేజీ జరిగే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపై అయినా శ్రీ లీల కథ విషయంలో జాగ్రత్త లు తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.