అమెరికా, యూరప్ ( America, Europe )దేశాలు భారతదేశంలోని ఒక అమ్మాయిని టార్గెట్ చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా తెలుస్తోంది.ఆ అమ్మాయి మరెవ్వరో కాదు, బీజేపీ బహిష్కృత నేత ‘నూపుర్ శర్మ’( Nupur Sharma ).
మహమ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యల విషయంలో ఈ తంతు చోటుచేసుకుంది.అవును, ఆమె చేసిన ఆయా వ్యాఖ్యలు అనుచితం అంటూ ఆయా దేశాలు ఆమెని టార్గెట్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ముస్లింలకు సంబంధించి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేసిందని వీళ్ళందరూ ప్రతిస్పందిస్తున్నారు సరే వీళ్లు ఎవరూ భారతదేశంపై దాడి చేయలేదా? గతంలో వీళ్ళు ఎక్కడా ఎవర్నీ హత్యలు చేయలేదా అంటూ అడుగుతున్నారు కొంతమంది.
ఇదే అదనుగా చేసుకొని భారతదేశం( India ) ముస్లింలపై విచక్షణ చూపిస్తుందంటూ అగ్ర దేశాలైన అమెరికా, యూరప్, చైనా దేశాలు ఈ విషయాన్ని ఏకతాటిపైకి తెచ్చి భారత్ ను టార్గెట్ చేస్తున్నట్లుగా అర్ధం అవుతోంది.దీన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాయి ఆయా దేశాలు.ఆ అక్కసుతోనే భారత్ పై వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
అయితే భారతదేశం ముస్లింలపై వివక్ష చూపిస్తుందంటూ వ్యాఖ్యలు చేస్తున్న చైనా ఎమన్నా తక్కువ తిందా? చైనాలో ఇప్పటికీ హిజాబ్ ధరించడానికి వీల్లేదు.బురఖా ధరించడానికి అసలు అనుమతే లేదు.
అక్కడ అనేక మసీదులు ధ్వంసం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
చివరికి పాత మసీదులను కూడా కూలగొట్టి మరీ, కమ్యూనిస్టు కార్యాలయాల్లా మార్చేస్తున్నారు.వీగర్లు అయితే అక్కడ మత ప్రార్థనలు చేయడానికి కూడా వీలు లేదని హుకుం జారీ చేసారు.ఇప్పుడు అక్కడ మసీదులు( Mosques ) కూల్చేస్తుంటే, ఆయా కమ్యూనిటీ ప్రజలు ఆశ్చర్యపడే విధంగా తిరగబడ్డారని తెలుస్తోంది.
నినాదాలు చేసి మరీ ఉద్యమాలు చేస్తున్నారని వినికిడి.చైనా చరిత్రలో ఒక కమ్యూనిటీ ఈ విధంగా ప్రభుత్వం పై తిరగబడటం ఇదే ప్రథమం అని అక్కడి వారు అంటున్నారు.
అయితే, ఈ విషయమై ఏ ఒక్క ముస్లిం దేశం స్పందించకపోవడం కొసమెరుపు.అలాంటి దేశాలు ఇండియాని టార్గెట్ చేయడం అది వారి దౌర్బల్యానికి సూచిక అని రాజకీయ నిపుణులు అంటున్నారు.