సౌత్ సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కాజల్ అగర్వాల్ ( Kajal Aggarwal )ఒకరు.స్టార్ హీరోలు అందరితో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.
ఇలా హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి కాజల్ పెళ్లి చేసుకుని కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
బాలకృష్ణ ( Balakrishna ) హీరోగా నటించిన భగవంత్ కేసరి ( Bhagavanth Kesari ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె తదుపరి సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇక ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లుగా కొనసాగే వారందరూ కూడా వివిధ రకాల షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో( Shopping Malls Opening ) కూడా సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కూడా భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే కాజల్ అగర్వాల్ ను హైదరాబాద్ కి చెందిన ఒక రియల్ ఎస్టేట్ సంస్థ తమ కరపత్రం లాంచ్ ఈవెంట్, ప్రచారానికి సంప్రదించారట.అయితే కాజల్ అగర్వాల్ మేనేజర్ ఏకంగా రూ 15 లక్షలు డిమాండ్ చేశాడట.
ఇలా గంట కార్యక్రమానికి కాజల్ అగర్వాల్ ఏకంగా 15 లక్షల రూపాయలు డిమాండ్( Kajal Aggarwal Remuneration ) చేయడంతో ఒక్కసారిగా సదరు సమస్థ వారు ఆశ్చర్యానికి గురయ్యారు.ఇలా ఈమెకు గంటకు 15 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ ఇవ్వడమే కాకుండా వచ్చి పోవడానికి ఫ్లైట్ టికెట్స్ అలాగే హోటల్ బిల్ కూడా ఆ సంస్థ వారే భరించాల్సి ఉంటుంది.గంటసేపు కోసం కాజల్ అగర్వాల్ భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ వారు ఈ ఆఫర్ శ్రీ లీల ( Sreeleela )వద్దకు తీసుకువెళ్లారు దీంతో ఆమె 12 లక్షలకే ఒప్పుకున్నారు.అలాగే ఈమె హైదరాబాద్ లోనే ఉంటుంది కనుక వచ్చి పోవడానికి కూడా ఎలాంటి ఇబ్బందులు అదనపు ఖర్చులు రావని భావించారు.
గంట కార్యక్రమానికే కాజల్ అగర్వాల్ ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.