మరోసారి రవితేజ తో జత కడుతున్న శ్రీలీలా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చాలా తక్కువ సమయం లో స్టార్ హీరోయిన్ రేంజ్ లో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీలీలా.( Sreeleel ).రెండో సినిమా మొదలవ్వడం లేటవ్వొచ్చేమో కానీ వన్స్‌ మొదలుపెట్టిన తర్వాత గ్యాప్‌ అనేదే లేకుండా దూసుకుపోతోంది వరుసగా ఎనిమిది సినిమాలు సెట్స్‌ మీద పెట్టుకుంది.మరో రెండు సినిమాలు త్వరలో సెట్స్‌ మీదకు వెళ్తాయి.

 Sreeleela In Gopichand Malineni Ravi Teja Movie , Raviteja , Sreeleela , Gunt-TeluguStop.com

ఇప్పుడు ఇంకో సినిమా ఆల్‌మోస్ట్‌ ఓకే అయిపోయింది.

టాలీవుడ్‌ యువ సంచలన నాయిక శ్రీలీల పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల… తొలి సినిమాలో క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టింది.

 Sreeleela In Gopichand Malineni Ravi Teja Movie , Raviteja , Sreeleela , Gunt-TeluguStop.com

దీంతో ఈమె స్టార్‌ హీరోయిన్‌ అవ్వడం గ్యారెంటీ అని సినిమా జనాలు ఫిక్స్‌ అయ్యారు.ఆ తర్వాత రెండో సినిమా ఓకే చేయడానికి చాలా రోజులు తీసుకుంది.

అంత గ్యాప్‌ తర్వాత రవితేజతో ‘ధమాకా’ ఓకే చేసింది.దీంతో ఆమె మీద విమర్శలు వచ్చాయి.

రవితేజతో అంటే ఏజ్‌ గ్యాప్‌ కనిపిస్తుందని, జోడీ బాగోదని అన్నారు.కానీ అవన్నీ పక్కన పెట్టి మరీ సినిమాలో అదరగొట్టింది.సినిమా విజయం సాధించింది…

Telugu Dhamaka, Guntur Karam, Raviteja, Sreeleela, Tollywood-Movie

ఇప్పుడు ధమాకా( Dhamaka ) గురించి ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకు అంటే… ఇప్పుడు ఆమె మరోసారి రవితేజతో కలసి నటించబోతోందన సమాచారం. గోపీచంద్‌ మలినేని( Gopichand Malineni ) దర్శకత్వంలో రవితేజ కథానాయకుడిగా ఓ చిత్రం రూపొందనుంది.ఆ సినిమాలో కథానాయికగా శ్రీలీల ఎంపికైనట్టు తెలుస్తోంది.ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉండొచ్చని సమాచారం.డైరెక్ట్‌గా సినిమా అనౌన్స్‌మెంట్‌తో పాటే ఈ జోడీ అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు…

Telugu Dhamaka, Guntur Karam, Raviteja, Sreeleela, Tollywood-Movie

ధమాకా లో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ, ఇద్దరి ఎనర్జీ అదిరిపోయాయి.ఇప్పుడు గోపీచంద్‌ మలినేని సినిమాలో డబుల్‌ ధమాకా చూడొచ్చు అంటున్నారు.ఇక గోపీచంద్‌ మలినేని సినిమాల్లో హీరోయిన్‌ క్యారెక్టర్స్‌ బలంగా ఉంటాయి.మరి అలాంటి పాత్రను శ్రీలీల ఎలా చేస్తుంది అనేది చూడాలి… ఈ సినిమాతో శ్రీలీల హీరోయిన్‌ గా చేస్తున్న సినిమాలు మొత్తం 11కు చేరుకున్నాయి అని చెప్పొచ్చు…అయితే అందులో మూడు సినిమాలు ప్రకటించాల్సి ఉంది…నాకు తెలిసి వచ్చే సంవత్సరం మొత్తం శ్రీలీలా సినిమాలే రిలీజ్ అవ్వనున్నాయని తెలుస్తుంది…వాటిలో కొన్ని విజయం సాధించిన కూడా శ్రీలీలా క్రేజ్ మరింత పెరిగిపోతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube