నటీనటులు :
శ్రీ విష్ణు.రెబ్బ మౌనిక జాన్, వెన్నెల కిషోర్, నరేష్ , రఘు బాబు, రాజీవ్ కనకాల, దేవి ప్రసాద్ తదితరులు.
సంగీతం :
గోపి సుందర్ .
దర్శకత్వం : రామ్ అబ్బరాజు.
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోస్ లో కాస్త డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే హీరోలలో ఒకడు శ్రీ విష్ణు( Sree Vishnu )క్యారక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత హీరో గా రాణిస్తూ ఎన్నో సినిమాల్లో నటించిన ఈయనకి సక్సెస్ రేట్ చాలా తక్కువే, కానీ ఇతని సినిమాలు ఓటీటీ లో మంచి ఆధరణని దక్కించుకుంటాయి.కమర్షియల్ గా మాత్రం ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలలో ‘బ్రోచేవారెవరురా‘ మరియు ‘రాజా రాజా చోర’ వంటి సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి.ఇప్పుడు ఆయన వరుస ఫ్లాప్ సినిమాల తర్వాత నేడు ‘సామజవరగమనా( Samajavaragamana )’ సినిమాతో మన ముందుకి వచ్చాడు.టీజర్ మరియు ట్రైలర్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం, సినిమా పరంగా కూడా అదే రేంజ్ లో అలరించిందో లేదో ఒకసారి చూద్దాము.
కథ :
బాలు ( శ్రీ విష్ణు) మల్టిప్లెక్స్ లో పని చేసుకునే ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన అబ్బాయి.కుటుంబ బాధ్యతలు మొత్తం తన నెట్టి మీదనే వేసుకుంటాడు.అయితే తన తాత ఆస్తి కేవలం తన తండ్రి (నరేష్ )( Naresh ) డిగ్రీ పట్టా పొందితేనే చెందుతుంది అనే విషయాన్నీ తెలుసుకొని, ఎలా అయినా తన తండ్రిని డిగ్రీ పూర్తి చేయించాలని తెగ కష్టపడతాడు.అప్పుడు ఆయనకీ అప్పుడే సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం అవుతున్న సరయు సహాయం తీసుకొని తన తండ్రిని పాస్ చేయించాలను అనుకుంటాడు.
ఆమెని అందుకోసం తన ఇంటికి అతిథిగా తీసుకొచ్చి ఆమె అయ్యే ఖర్చులన్నీ భరిస్తాడు.అయితే అంత ప్రయత్నం చేసినా కూడా నరేష్ డిగ్రీ ఫెయిల్ అవుతాడు.
అప్పటి వరకు బాలు పడిన కష్టాలన్నీ వృధా అవుతుంది.కానీ ఈలోపే సరయు బాలు తో ప్రేమలో పడుతుంది.
ప్రేమ అంటేనే అసలు గిట్టని బాలు తనకి ఐ లవ్ యూ చెప్పిన ప్రతీ అమ్మాయితో రాఖీ కట్టించుకుంటూ ఉంటాడు.కానీ సరయు ఎలానో తన ప్రేమలోకి దింపేస్తుంది, అప్పుడే సరయు గురించి ఒక చేదు నిజం బాలుకి తెలుస్తుంది.
అది తెలుసుకున్నాక బాలు రియాక్షన్ ఏమిటి?, సరయు ని పెళ్లి చేసుకుంటాడా?,తన తండ్రికి డిగ్రీ పట్టా దక్కేలా చేస్తాడా?, ఇలాంటివన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ఇక సింపుల్ పాయింట్ మీద రెండు గంటల సినిమాని ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా తియ్యడం అనేది సాధారమైన విషయం కాదు.దర్శకుడి ప్రతిభ ఇలాంటి సమయాల్లోనే తెలుస్తుంది.ఈ చిత్ర దర్శకుడు కూడా అదే నిరూపించుకున్నాడు.
ఇన్ని రోజులు మనం సినిమాలలో తండ్రి కొడుకు బాగు కోసం , అతని బాగా చదువుకోవాలని తిట్టడాలు చూసాము.కానీ ఇక్కడ మొత్తం రివర్స్ తండ్రి చదువుకోకపోతే కొడుకు తిడుతాడు, అతను పరీక్షలలో పాస్ అవ్వడానికి నానా తంటాలు పడుతాడు.
ఇవన్నీ వెండితెర మీద చూసేటప్పుడు పొట్ట చెక్కలు లాగ నవ్వుకుంటాము.అలా డిజైన్ చేసాడు డైరెక్టర్ స్క్రీన్ ప్లే.అయితే ఫస్ట్ హాఫ్ తో పోల్చి చూస్తే సెకండ్ హాఫ్ కాస్త తగ్గింది కానీ, ఎక్కడా కూడా బోర్ కొట్టదు.ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో ‘కుల శేఖర్‘ గా ఎంట్రీ ఇచ్చే వెన్నెల కిషోర్ కామెడీ బాగా వర్కౌట్ అయ్యింది.
ఇక నరేష్ నటన ఈ సినిమాకి ఆయువు పట్టులాంటిది, తన 30 ఏళ్ళ అనుభవం మొత్తం ఈ సినిమాలో చూపించాడు, తన కామెడీ టైమింగ్ విశ్వరూపం ఏమిటో మరోసారి అందరికీ అర్థం అయ్యేలా చేసాడు.ఇక శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, కామెడీ టైమింగ్ లో కానీ, ఎమోషన్స్ పండించడం లో కానీ ఇప్పటికే ప్రూవ్ చేసుకున్న నటుడు, ఈ సినిమాలో కూడా అదే చేసాడు.
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రానికి సంగీతం అందించిన గోపి సుందర్ మంచి పాటలను అందించలేకపోయాడు.ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చి ఉంటె ఈ చిత్రం వేరే లెవెల్ కి వెళ్లి ఉండేది.
చివరి మాట :
చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి థియేటర్స్ కి వెళ్లి మనస్ఫూర్తిగా నవ్వుకోదగ్గ చిత్రం.ఎట్టి పరిస్థితిలో కూడా మిస్ కాకండి.