కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నటి శ్రీలీల( Sreeleela ).పెళ్లి సందడి సినిమా ద్వారా నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ తో కలిసి ఈమె ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.
ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ శ్రీ లీల అందం అభినయం నటనతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు.ఇలా ఈ సినిమా తరువాత ఈమెకు తెలుగులో ధమాకా( Dhamaka ) సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
ఈ సినిమాలో శ్రీలీల( Sreeleela ).తన నటన విశ్వరూపం చూపించారు.ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ కావడంతో ఈమెకు ఒక్కసారిగా స్టార్ డం వచ్చేసింది.

ఇలా ఒక సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఇండస్ట్రీలో శ్రీలీలకు ఏకంగా 10 సినిమాలకు పైగా అవకాశాలు వచ్చాయి ఇలా స్టార్ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల సినిమాలకు కూడా శ్రీ లీలా ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయారు.ఇలా చేతిలో పది సినిమాలకు పైగా అవకాశాలను పెట్టుకున్నప్పటికీ తదుపరిచిన అవకాశాలు వస్తున్న ఈమెకు సమయం లేక రిజెక్ట్ చేస్తున్నటువంటి సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్పాలి.ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి శ్రీలీల స్కంద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేక పోయింది.

ఇక తదుపరి ఈమె బాలకృష్ణ( Balakrishna ) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నటువంటి భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.అలాగే ఈమె ఓల్డ్ వీడియోస్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే స్కంద సినిమా ( Skanda Movie )ప్రమోషన్లకు సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇందులో భాగంగా యాంకర్ సుమ హీరోని ప్రశ్నిస్తూ ఒక రోజు కనుక శ్రీలీల సినిమా షూటింగుకు బంక్ కొడితే ఏం జరుగుతుంది అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ ఒక రోజు ఈమె షూటింగ్కు రాకపోతే ఏకంగా 10 సినిమాల షూటింగులు ఆగిపోతాయని నిర్మాతలకు భారీగానే నష్టాలు వస్తాయి అంటూ సమాధానం చెప్పారు.ఇలా సుమారు పది సినిమాలకు పైగా అవకాశాలను అందుకున్న ఈమె ఒకరోజు షూటింగ్ కనక హాజరు కాకపోతే ఇబ్బందులు ఏర్పడటమే కాకుండా కోట్లలో నష్టాలు కూడా వస్తాయి అంటూ తెలియచేశారు.
ఇక శ్రీ లీల సినిమాల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, మహేష్ బాబు గుంటూరు కారం, వైష్ణవ్ఆదికేశవ, అలాగే విజయ్ దేవరకొండ, నితిన్ వంటి హీరోలందరి సినిమాలలో కూడా ఈమె నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.అయితే స్కంద సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈమె తదుపరి సినిమా భగవంత్ కేసరి పై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
అయితే ఈ సినిమాలో ఈమె బాలకృష్ణకు కూతురు పాత్రలో నటించారు.ఈ సినిమా సక్సెస్ అయితేనే కెరియర్ పరంగా శ్రీ లీలకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభిస్తుందని లేకపోతే ఈమె కెరియర్ పట్ల బ్యాడ్ ఒపీనియన్ కలిగే అవకాశాలు ఉన్నాయని చెప్పాలి ఈ సినిమా విజయం శ్రీ లీల కెరీర్ కు ఎంతో కీలకంగా మారింది.







