నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండల కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామం ఎన్టీఆర్ చౌరస్తా లో దివంగత నేత నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రులు మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే, ఆర్కే పూడి గాంధీ, జైరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, లతో పాటు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల ప్రజల కొరకు అనేక అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని
ఈ రోజుల్లో వాటిని కేంద్రంలో అమలు చేయుచున్నారని ఆయన సూచించారు తెలుగు రాష్ట్రంలో టిడిపి పార్టీని ఏర్పాటు చేయడంతో పాటు సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్న వారందరికీ ఐక్యంగా చేసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేశారని అన్నారు.స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ పార్టీ అధిక కాలం కేంద్రంతో పాటు రాష్ట్రాన్ని పాలించిందని ,మధ్యలో రెండు గా చిలి పోవడంతో వారిలో ఐక్యత లేక సరియైన పాలన అందించలేకపోయారని వాటిని గమనించిన నందమూరి తారక రామారావు సినీ ఇండస్ట్రీలో ఉంటూ తెలుగు ప్రజల బాగోగుల కోసం తాపత్రయపడేవారని అన్నారు ఆ రోజుల్లో నా దేశం సినిమాను తీసి ప్రజల వందనాలు పొందారని సమస్యల సాధనాల గురించి తెలియపరిచారని అన్నారు
అప్పటినుండి తెలుగు రాష్ట్రము మొత్తము సంచరిస్తూ తను చేయబోయే కార్యక్రమాన్ని ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఘన విజయం సాధించారని ఆ సందర్భంగా నే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికై పేదవారికి రెండు రూపాయల కు కిలో బియ్యం, చేనేత వస్త్రాలు ఉచితంగా అందించారని ఉచిత విద్యుత్ ప్రజలకు అందించారని అలాగే ప్రజల కొరకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వాటన్నిటిని ప్రస్తుతము టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు ఎన్టీఆర్ ఆధ్వర్యంలో పనిచేసిన అనేకమంది బి ఆర్ఎస్ ప్రభుత్వంలో చేరడం జరిగిందని ఎన్టీఆర్ అమలు చేసిన పథకాన్ని కెసిఆర్ కూడా అమలు చేస్తున్నారని నీతి నిజాయితీతో కూడిన పాలలను తెలంగాణ ప్రజలకు అందిస్తున్నామని స్పీకర్ తెలియపరిచారు.