రాజకీయ ఎంట్రీపై స్టార్ హీరో విజయ్ కీలక వాఖ్యలు

తమిళ రాజకీయాలలో మొదటి నుంచి కోలీవుడ్ స్టార్స్ హవా ఉంటుంది.

అక్కడ ప్రధాన పార్టీలు రెండూ కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదిగిన వారితోనే రాష్ట్ర రాజకీయాలని శాశించే స్థాయికి ఎదిగాయి.

ఇప్పుడు త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో మరో సారి సినీ స్టార్స్ తో తమిళ రాజకీయాలలో ఆసక్తికరంగా మారాయి.అక్కడ కమల్ హాసన్, రజినీకాంత్ ఇప్పటికే రాజకీయాలలో క్రియాశీలకంగా మారి తమ స్పీడ్ చూపిస్తున్నారు.

అయితే కమల్ హాసన్ కంటే రజినీకాంత్ మీద ఎక్కువ నమ్మకం ఉంది.కచ్చితంగా రాబోయే ఎన్నికలలో రజినీకాంత్ ప్రభావం చూపిస్తారని టాక్ ఉంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు తమిళ రాజకీయాలలో మరో స్టార్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సంచలనంగా మారింది.ఎప్పటి నుంచో విజయ్ రాజకీయ ఎంట్రీపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Advertisement

అప్పుడప్పుడు అభిమానులు విజయ్ పోస్టర్లను ఏర్పాటు చేస్తూ రాజకీయాల్లోకి రావాలని కోరుతుంటారు.విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై మరోసారి వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపధ్యంలో తన అభిమానులు నిరాశ చెందకుండా విజయ్ ఓ కీలక ప్రకటన చేశారు.తన రాజకీయ రంగ ప్రవేశంలో జరుగుతోన్న ఆలస్యంతో అసంతృప్తితో ఉన్న అభిమానులు ఎవ్వరూ ఇతర పార్టీల్లోకి వెళ్లొద్దని ఆయన సూచించాడు.తన అభిమాన సంఘం మక్కల్‌ ఇయక్కం నుంచి అభిమానులు వైదొలగవద్దని ఆయన కోరారు.

చాలాకాలంగా సహనంతో ఎదురు చూసిన అభిమానుల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైందంటూ ప్రకటన చేశారు.ఎవ్వరూ అధైర్యపడవద్దని చెప్పారు.కాగా, నిన్న తన అభిమాన సంఘాల నేతలతో విజయ్ సమావేశమై ఈ విషయంపై చర్చించారు.

ఈ నేపధ్యంలో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడం లేదంటే ఎన్నికల ముందు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేయడం చేసే అవకాశం ఉందనే మాట ఇప్పుడు తమిళ రాజకీయాలో వినిపిస్తుంది.మరో వైపు విజయ్ ఇచ్చిన పొలిటికల్ ప్రకటనతో ఇతర రాజకీయ పార్టీలు కూడా అలెర్ట్ అయ్యాయి.

భర్తతో దిగిన ఫోటోలను డిలీట్ చేయాలని కోరిన కత్రినా కైఫ్.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు