భారత సైన్యానికి జెట్ ప్యాక్ సూట్లు.. ఉగ్రవాదులకు ఇక చుక్కలే!

నిత్యం సరిహద్దులో భారత్‌కు పాక్, చైనా నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి.పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు నిత్యం చొరబాట్లకు ప్రయత్నిస్తుంటారు.

 Special Forces Test New Jetpack Suit At Army Airborne Training School In Agra De-TeluguStop.com

ఇక చైనా సైనికులు అదును చూసి భారత భూభాగాన్ని ఆక్రమిస్తున్నారు.ఈ తరుణంలో వారికి బుద్ధి చెప్పేందుకు భారత సైన్యం( Indian Army ) సిద్ధం అయింది.

చైనా సరిహద్దులతో సహా ఇతర సరిహద్దు ప్రాంతాల వెంబడి నిఘా సామర్థ్యాలను బలోపేతం చేసే ప్రయత్నంలో, భారత సైన్యం త్వరలో ‘జెట్‌ప్యాక్ సూట్‌లను’( Jetpack Suits ) వినియోగించనుంది.

బ్రిటిష్ కంపెనీ ‘గ్రావిటీ ఇండస్ట్రీస్’( Gravity Industries ) తయారు చేసిన జెట్‌ప్యాక్ సూట్‌లను ఇటీవల ఆగ్రాలోని ఆర్మీ ఎయిర్‌బోర్న్ ట్రైనింగ్ స్కూల్‌లో( Army Airborne Training School ) ప్రదర్శించారు.

వాటి పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలించారు.గ్రావిటీ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు రిచర్డ్ బ్రౌనింగ్ భారత సైన్యానికి జెట్‌ప్యాక్ సిస్టమ్ డెమో ఇచ్చారు.ది ఇండియన్ ఏరోస్పేస్ డిఫెన్స్ న్యూస్ (ఐఎడిఎన్) ట్విటర్‌లో గ్రావిటీ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ఆగ్రాలోని( Agra ) వాటర్ బాడీ, రోడ్డు, పొలాల మీదుగా జెట్ ప్యాక్ సూట్లను ధరించి ఎగురుతున్న వీడియోను షేర్ చేసింది.

జెట్‌ప్యాక్ సూట్‌లో మూడు జెట్ ఇంజన్‌లు ఉన్నాయి.ఒకటి వెనుకవైపు ఉంటే, మిగిలిన రెండు చేతులకు ఉంటాయి.ఇవి జెట్ ప్యాక్ సూట్లను ధరించిన వారికి గాలిలో నావిగేట్ చేయడానికి సహాయపడుతుంది.

ఫాస్ట్‌ట్రాక్ విధానం ద్వారా 44 జెట్‌ప్యాక్ సూట్‌ల కొనుగోలు కోసం సైన్యం ఆ కంపెనీకి ఆర్డర్ చేసింది.జెట్‌ ప్యాక్ సూట్ అనేది ధరించిన వ్యక్తిని గాలిలో నడిపించే పరికరం.

ఈ పరికరం గ్యాస్ లేదా ఫ్యూయల్‌ను ఇంధనంగా ఉపయోగిస్తుంది. చైనాతో( China ) దాదాపు 3,500 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి మొత్తం నిఘా యంత్రాంగాన్ని బలోపేతం చేయడంపై సైన్యం దృష్టి సారిస్తున్న సమయంలో జెట్‌ప్యాక్ సూట్‌ను భారత్ పరీక్షించింది.

ముఖ్యంగా తూర్పు లడఖ్ సరిహద్దులో( East Laddakh ) చైనా దళాలతో వివాదం తర్వాత ఎప్పటికప్పుడు సరిహద్దుల పర్యవేక్షణకు, ఆక్రమణలను అడ్డుకునేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి.జెట్‌ప్యాక్ సూట్ బ్యాక్‌ప్యాక్ లాగా ధరిస్తారు.80 కిలోల వరకు బరువు ఉన్న వ్యక్తిని ఇది మోయగలదు.ఇది గరిష్టంగా గంటకు 50 కి.మీ.వేగంగా ప్రయాణిస్తుంది.ఇవి భారత సైన్యానికి పూర్థి స్థాయిలో అందితే ఇక సరిహద్దుల్లో మన సైనికుల గస్తీ మరింత బలోపేతం కానుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube