వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల( ys sharmila )కు మంచి రోజులు వచ్చినట్టుగా కనిపిస్తున్నాయి .రాబోయే తెలంగాణ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి అధికారంలోకి రావాలని షర్మిల ముందుగా భావించినా, పార్టీలో పెద్దగా చేరికలు లేకపోవడంతో, చివరకు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.
కానీ పొత్తు ప్రతిపాదనకు కాంగ్రెస్ అధిష్టానం ఒప్పుకోకపోవడం , షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనే షరతును విధించడంతో, చాలా రోజులుగా షర్మిల తర్జన భర్జన పడుతున్నారు.కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె శివకుమార్ తో ఉన్న పరిచయాన్ని ఉపయోగించుకుని కాంగ్రెస్ అధిష్టానం పెద్దలపై ఒత్తిడి చేసే ప్రయత్నం చేసినా… షర్మిల కోరిక నెరవేరలేదు.తెలంగాణ కాంగ్రెస్ లోకి షర్మిల రాకను పీసీసీ రేవంత్ రెడ్డి తో పాటు , అనేకమంది నేతలు వ్యతిరేకిస్తుండడంతో, చివరకు ఏపీ కాంగ్రెస్ కు అధ్యక్షురాలుగా ఆమెను పంపించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకుంది.

అయితే ఆ ప్రతిపాదనకు షర్మిల ఒప్పుకోకపోవడంతో ఈ విషయంలో ఏ క్లారిటీ రాలేదు.తాజాగా ఈ విషయంలో డీకే శివకుమార్,( DK Siva Kumar ) వేణుగోపాల్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం .కాంగ్రెస్ లోకి షర్మిల పార్టీని ఆహ్వానించి ఆమెకు గౌరవప్రదమైన హోదా ఇవ్వాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించుకున్నారట.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేసి వేణుగోపాల్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు షర్మిల తో చర్చించిన వేణుగోపాల్, శివకుమార్ లు కాంగ్రెస్ లో షర్మిల పార్టీని విలీనం చేసే విధంగా ఒప్పించారట.ఫలితంగా షర్మిలను కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపాలనే ఆలోచనకు డీకే శివకుమార్ , వేణుగోపాల్ నిర్ణయించడంతో పాటు, ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట.

ఆమెను కాంగ్రెస్ ఆల్ ఇండియా కమిటీకి ప్రధాన కార్యదర్శిగా నియమించి ఆ హోదాలో ఏపీ ఇన్చార్జిగా పంపించాలనే నిర్ణయానికి అధిష్టానం పెద్దలు కూడా వచ్చారట.షర్మిల కాంగ్రెస్ ఏపీ బాధ్యతలు తీసుకుంటే అక్కడ అధికార పార్టీలో ఉన్న తన అన్న పార్టీ వైసీపీకి ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి.వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ పోటీ చేసి అన్నిటిలోనూ విజయం సాధించాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు . జగన్( CM jagan ) ను ఓడించేందుకు కాంగ్రెస్ తోపాటు, టిడిపి, బిజెపి , జనసేన తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.ఇప్పుడు వారి కి షర్మిల కూడా జత కలిస్తే వైసిపికి ఇబ్బందులు తప్పవని, అంతేకాకుండా వైఎస్ కుటుంబానికి ఉన్న ఓటు బ్యాంకు లోను చీలిక వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.







