చిన్మయి సింగిల్ గా ఉందంటే ప్రపంచంలో అబ్బాయిలు వేస్ట్ అనిపించింది: రాహుల్ రవీందర్

If Chinmayi Was Single, The Boys In The World Felt Like A Waste , Chinmayi Sripada, Rahul Ravinder, Vennela Kishore, Ala Modalyindi

టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా,డబ్బింగ్ ఆర్టిస్టుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ చిన్మయి శ్రీపాద ( Chinmayi Sripada ) ఒకరు.ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటుడు రాహుల్ రవీందర్ ( Rahul Ravinder ) ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

 If Chinmayi Was Single, The Boys In The World Felt Like A Waste , Chinmayi Srip-TeluguStop.com

ఇలా వీరిద్దరు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉన్నారు.ఇలా వ్యక్తిగత జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నటువంటి ఈ దంపతులు తాజాగా అలా మొదలైంది ( Ala Modalyindi ) కార్యక్రమానికి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చిన్మయితో రాహుల్ ప్రేమలో పడిన విషయం గురించి వెల్లడించారు.

Telugu Ala Modalyindi, Rahul Ravinder, Vennela Kishore-Movie

ఈ కార్యక్రమంలో భాగంగా వెన్నెల కిషోర్ ( Vennela Kishore ) అసలు మీ కథ ఎలా మొదలైంది అని ప్రశ్నించడంతో చిన్మయి సమాధానం చెబుతూ అందాల రాక్షసి సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు సినిమా విషయాలు తనకు చెప్పడానికి రాహుల్ వచ్చాడని తనని చూడడం అదే మొదటిసారి అని చిన్మయి తెలిపారు.ఇక రాహుల్ ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ… అందాల రాక్షసి సినిమా డబ్బింగ్ చెప్పేటప్పుడు తనని చూసానని ఈ అమ్మాయి గొంతు చాలా బాగుందనిపించిందని తెలిపారు.అయితే అప్పటికే ఆమె స్టార్ సింగర్.

తనకు మాత్రం ఇంకా రెండో సినిమానే అని రాహుల్ తెలిపారు.ఈ సినిమా డబ్బింగ్ పూర్తి అయిన తర్వాత ఈమె టీం అందరిని టాగ్ చేస్తూ సినిమా చాలా అద్భుతంగా ఉందని చెప్పారు.

Telugu Ala Modalyindi, Rahul Ravinder, Vennela Kishore-Movie

ఇలా తను మెసేజ్ చేయడంతో ఈ అమ్మాయి కాదు తన ఆలోచనలు కూడా బాగున్నాయి అనిపించింది.ఈమె మెసేజ్ చేయడంతో తాను కూడా రిప్లై ఇచ్చి అలా తనతో మాటలు కలిపానని రాహుల్ తెలిపారు.ఇలా మా ప్రయాణం మొదలైందని రాహుల్ రవీందర్ ఈ సందర్భంగా వెల్లడించారు.ఇక తనతో చాట్ చేస్తున్నప్పుడు తను ఎవరితోనైనా రిలేషన్ లో ఉందా లేక సింగిల్ గా ఉందా అని ఆలోచించానని, అయినా ఇంత మంచి అందమైన అమ్మాయి సింగిల్ గా ఉంది అంటే ఈ ప్రపంచంలో అబ్బాయిలందరూ చాలా వేస్ట్ అనిపించిందని రాహుల్ ఈ సందర్భంగా తెలియజేశారు.

అయితే ఆమెతో చాట్ చేసుకుంటూనే తన ప్రేమ విషయాన్ని పెళ్లి విషయాన్ని కూడా చెప్పానని రాహుల్ ఈ సందర్భంగా తన ప్రేమ పెళ్లి విషయం గురించి తెలియజేస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube