తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.శీను అంటే బహుశా గుర్తుపట్టకపోవచ్చు కానీ ప్రభాస్ శీను(Prabhas Seenu) అంటే మాత్రం టక్కున ఈయనని గుర్తుపడతారు.
విలక్షణమైన హావభావాలతో కామెడీని పండించగలిగే అతి తక్కువ మంది కమెడియన్లలో ఈయన కూడా ఒకరు.ఇలా పలు సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ శీను తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తన అసలు పేరు శ్రీనివాస్ రావు తనది వైజాగ్ అని తెలియజేశారు.ఇక చదువు మొత్తం వైజాగ్ లోనే కొనసాగిందని తన తండ్రి తనని డాక్టర్ చేయాలని ఆశపడ్డారు కానీ తనకు యాక్టింగ్ పై ఆసక్తి ఉందనే విషయం తెలిసి అందరూ తనని ఎంతో హేళన చేశారని ప్రభాస్ శీను తెలిపారు.ఇక మా నాన్నకు శరత్ బాబు(Sarath Babu) గారితో మంచి అనుబంధం ఉండడంతో శరత్ బాబు గారి సూచనల మేరకు తనకు సినిమాలలో శిక్షణ ఇప్పించారని తెలిపారు.
ఈ క్రమంలోనే సత్యానంద్(Satyanand) గారి యాక్టింగ్ స్కూల్లో తాను చేరానని ప్రభాస్ శీను తెలిపారు.

ఇక ఇదే యాక్టింగ్ స్కూల్లో ప్రభాస్ కూడా శిక్షణ తీసుకుంటున్నారని అలా తనకు ప్రభాస్ పరిచయమయ్యారు అంటూ ఈయన తెలిపారు.ఇక తనకు ట్రైనింగ్ లో ఉండగానే ఒక సినిమా అవకాశం వచ్చిందని ఆ సినిమా తీవ్ర నిరాశపరచడంతో అప్పుడు ప్రభాస్ (Prabhas) తనని తనతో పాటే ఉండమని చెప్పారు.అలా తాను ప్రభాస్ ఎక్కువగా ఉండటం వల్ల తనని అందరూ ప్రభాస్ శీను అని పిలవడం మొదలు పెట్టారంటూ ఈయన తెలియజేశారు.
ఇక ఇండస్ట్రీలో అవకాశాలు అందుకొని తనకు ఎంతోమంది స్నేహితులు ఉన్నప్పటికీ తాను మాత్రం అన్ని షేర్ చేసుకునేది కేవలం ప్రభాస్ తో మాత్రమేనని నాకన్నీ ప్రభాసే అంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







