బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.స్పీకర్ పై ఈటల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
బీఏసీ సమావేశానికి బీజేపీని ఆహ్వానించకపోవడంపై ఈటల మండిపడ్డారు.ప్రభుత్వం చెప్పిన మాటలు వింటూ స్పీకర్ ఓ మర మనిషిలా వ్యవహరించవద్దని సూచించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈటల వ్యాఖ్యలపై నోటీసులు ఇచ్చేందుకు స్పీకర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.







