అంతరిక్షంలో పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసాయి.. కాకపోతే ఖర్చు ఎంతో తెలుసా..!

ప్రతి ఒక్కరూ పెళ్లి గురించి ఎన్నో కలలు కంటారు.జీవితంలో ఒకేసారి చేసుకునే పెళ్లి గురించి ఎన్నో లెక్కలు వేసుకొని అలా చేసుకోవాలి ఇలా చేసుకోవాలి అని ప్లాన్లు వేసుకుని ఎంతో సంతోషంగా పెళ్లి( Wedding ) చేసుకుంటారు.

 Space Perspective Offering Couples To Hold Their Wedding In Space Latest News,-TeluguStop.com

ఇప్పుడు భూమిపై పెళ్లి చేసుకునే రోజులు పోయి.అంతరిక్షంలో పెళ్లి చేసుకునే రోజులు వచ్చేసాయి.

పలు ఇంటర్నేషనల్ కంపెనీలు అంతరిక్షంలో పెళ్లిళ్లు చేసేందుకు సిద్ధమయ్యాయి.ఈ విషయం వింటే ఎవరికైనా అంతరిక్షంలో పెళ్లా.

అని ఆశ్చర్యపోతారు.నిజానికి ఇది వాస్తవమే.

అయితే ఖర్చు మాత్రం కాస్త ఎక్కువే.ఈ విషయం విని అబద్ధం అని తీసిపారేయకండి.2024 నాటికి అంతరిక్షంలో పెళ్లిళ్లు చేసే ఫెసిలిటీ అందుబాటులోకి రానుంది.స్పేస్ పెర్స్ పెక్టివ్( Space Perspective ) అనే కంపెనీ స్పేస్ వెడ్డింగ్ ను ప్రారంభించింది.

న్యూట్రల్ బెలూన్ లో కూర్చుని అంతరిక్షంలో ఎంచక్కా పెళ్లి చేసుకుంటూ భూమిపై ఉండే అందమైన దృశ్యాలను చూడవచ్చు.

Telugu Married, Latest, Latest Telugu, Space-Technology Telugu

ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ లో అతిథులను లక్ష అడుగుల ఎత్తుకు తీసుకువెళ్తారు.దాదాపుగా 6 స్పేస్ షిప్ నెప్ట్యూన్ విమాన ప్రయాణం సాగుతుంది.ఇప్పటికే కంపెనీ అంతరిక్షంలో పెళ్లి చేసుకోవాలి అనే వారి కోసం బుక్కింగ్స్ ప్రారంభించింది.

దాదాపుగా 1000 కి పైగా టికెట్లు బుక్ అయ్యాయి.స్పేస్ వెడ్డింగ్ ఎంజాయ్ చెయ్యాలి అనుకునే జంటలు స్పేస్ పెర్స్ పెక్టివ్ వెబ్సైట్ సందర్శించి బుక్కింగ్ నమోదు చేసుకోవచ్చు.

Telugu Married, Latest, Latest Telugu, Space-Technology Telugu

ఈ విషయాలు విన్న వారందరిలో కలిగే సందేశం ఏమిటంటే ఖర్చు ఎంత అవుతుందో అనే కదా.నెప్ట్యూన్ లో సీటు కోసం 125000 యూఎస్ డాలర్లు ఖర్చు అవుతుంది.భారత కరెన్సీ ప్రకారం 10,283,250 రూపాయలు అవుతుంది.కంపెనీ రిఫ్రెష్ మెంట్ సౌకర్యంతో పాటు వై-ఫై, టాయిలెట్, ఫ్లోటింగ్ లాంజ్ వంటి సౌకర్యాలను అందించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube