'ఇగ్లూ' తరహాలో పెంపుడు కుక్కల కోసం హైటెక్‌ ఏసీ ఇల్లు.. చూస్తే ఆశ్చర్యపోతారు..

పెంపుడు కుక్కలు, పిల్లులను చాలా మంది అపురూపంగా చూసుకుంటారు.చాలా మంది వాటిని తమ ఇంట్లో ఒక మనిషిలా భావిస్తారు.

 South Korea Designer Igloo Shaped Hitech Ac House For Pet Dogs Details, Igloo, H-TeluguStop.com

వాటికి ఏదైనా అనారోగ్యం చేస్తే అల్లాడిపోతారు.వెంటనే వెటర్నరీ వైద్యుల వద్దకు పరుగులు పెడతారు.

ఇక వేసవి కాలం వచ్చిందంటే మనుషులు ఏసీలలో( AC ) ఉండి సేదదీరుతారు.మరి పెంపుడు జంతువుల( Pet Animals ) సంగతి ఆలోచిస్తే కొంచెం బాధ కలుగుతుంది.

ఎందుకంటే అవి కూడా జీవులే కదా.

పెంపుడు జంతువుల కోసం చిన్న పాటి ఏసీతో కూడిన ఇల్లు తయారు చేస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఈ ఆలోచన దక్షిణ కొరియాకు( South Korea ) చెందిన ప్రముఖ డిజైనర్ సీంగ్‌మీన్ లీకి( Seungmin Lee ) వచ్చింది.అనుకున్నదే తడవుగా ఆమె ఓ అద్భుతమైన ఆవిష్కరణ చేసింది.ఇగ్లూ తరహాలో( Igloo ) చూడచక్కని చిన్న ఇల్లును పెంపుడు కుక్కల కోసం రూపకల్పన చేసింది.దీనిని చూసిన పెట్ లవర్స్ చాలా ముచ్చట పడుతున్నారు.దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Telugu Ac, Igloo, Igloo Dog, Latest, Pet Dogs, Seungmin Lee, Small Ac, Korea-Lat

మండు వేసవిలో పెంపుడు కుక్కలు, ఇతర జంతువులు చాలా ఇబ్బంది పడతాయి.ఇళ్లలో ఉన్నప్పుడైతే చాలా మందికి ఏసీలు ఉంటాయి కాబట్టి పర్వాలేదు.అదే బయటకు వెళ్లినప్పుడు మనుషులు సైతం చాలా ఇబ్బంది పడతారు.అధిక ఉష్ణోగ్రతలకు( Temperature ) అల్లాడిపోతుంటారు.అయితే జంతువులు మాత్రం తమ బాధను వ్యక్తపరచలేవు.వాటికి కూడా ఎండలు, ఉష్ణోగ్రతల వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి.

దీనిని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ డిజైనర్ సీంగ్‌మీన్ లీ గమనించారు.పెంపుడు కుక్కల కోసం ప్రత్యేకంగా ఇగ్లూ తరహాలో ఏసీ ఇంటిని( AC House ) తయారు చేశారు.

మండుతున్న వేసవిలో ఉపయోగించేందుకు కూలింగ్ డాగ్ హౌస్‌ బాగుంటుంది.

Telugu Ac, Igloo, Igloo Dog, Latest, Pet Dogs, Seungmin Lee, Small Ac, Korea-Lat

వేసవికాలం( Summer ) వేడిగా మరియు పొడిగా మారినప్పుడు, పెంపుడు జంతువులను సౌకర్యవంతంగా ఉంచడానికి కూలింగ్ డాగ్ హౌస్( Cooling Dog House ) గొప్ప పరిష్కారం కావచ్చు.డాగ్ హౌస్‌కు ముందు భాగంలో ప్రవేశ ద్వారం ఉంటుంది.తర్వాత లోపల గోపురం తరహాలో నిర్మాణాన్ని కలిగి ఉంది.

ప్రవేశద్వారం వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా ఇగ్లూ ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది.ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, అది పెంపుడు జంతువు ప్రవేశాన్ని గుర్తించి లోపల ఉష్ణోగ్రతలను దానికి తగ్గట్టు నియంత్రిస్తుంది.

దీని ధర ఆన్‌లైన్‌లో 160 యూఎస్ డాలర్లుగా నిర్ణయించారు.భారత కరెన్సీలో దీనిని రూ.13,221లకు కొనుగోలు చేయొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube