కరోనా తర్వాత బాలీవుడ్ చాలా కష్టాలను ఎదుర్కొంటుంది.ఒకవైపు మన సౌత్ ఇండస్ట్రీ వరుస హిట్స్ అందుకుంటూ వందల కోట్లను వసూలు చేస్తుంటే.
బాలీవుడ్ మాత్రం ఇప్పటికి కోలుకోలేక పోతుంది.అక్కడి ప్రేక్షకులు ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలను రిజక్ట్ చేస్తున్నారు.
దీంతో అక్కడ పాండమిక్ తర్వాత ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ కూడా పడలేదు.
అందుకే మన సౌత్ సినిమాలను తక్కువ చేసిన వారే ఇప్పుడు మన సినిమాలను ఇష్టపడుతున్నారు.
బాహుబలి, ట్రిపుల్ ఆర్, పుష్ప, కార్తికేయ 2 వంటి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు వచ్చిన తర్వాత మన స్థాయి మరింత పెరిగింది.అందుకే ఇక్కడ సినిమాల్లో నటించడానికి సైతం వెనక్కి తగ్గడం లేదు.
ఇప్పటికే బాలీవుడ్ స్టార్స్ చాలా మంది మన సినిమాల్లో స్పెషల్ రోల్స్ లో నటిస్తున్నారు.ఇక ఇప్పుడు అక్కడి స్టార్ హీరోలు మన దర్శకులతో సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు అని పరిస్థితులు చూస్తుంటే అర్ధం అవుతుంది.
బాలీవుడ్ బడా హీరో షారుఖ్ ఖాన్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

ఇక హృతిక్ రోషన్ కూడా తాజాగా నటిస్తున్న విక్రమ్ వేదా రీమేక్ ను మన సౌత్ డైరెక్టర్ నే డైరెక్ట్ చేస్తున్నాడు.అలాగే రణ్వీర్ సింగ్ కూడా కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు రీమేక్ చేయబోతున్నాడు.
అలాగే బాలీవుడ్ కండల వీరుడు కూడా సౌత్ డైరెక్టర్ ను లైన్లో పెడుతున్నట్టు వార్తలు అందుతున్నాయి.

అలాగే మన డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో ఇద్దరు ముగ్గురు బడా హీరోలు సినిమాలు చేయడానికి చర్చలు జరుపుతున్నట్టు కూడా అక్కడి మీడియా కథనాలు ప్రచురిస్తుంది.ఇలా అక్కడి స్టార్ హీరోలందరూ సౌత్ దర్శకులతో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.అలాగే సీనియర్ నటులు మన సౌత్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించడానికి సిద్ధం అవుతున్నారు.
ఒకప్పుడు మన సౌత్ ఇండస్ట్రీని చిన్న చూపు చుసిన హీరోలే ఇప్పుడు స్వయంగా ఇక్కడ నటించడానికి ఆసక్తి చూపించడంతో అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఎంత మారిపోయాయో అందరికి అర్ధం అవుతుంది.
మరి మన దర్శకులతో అయినా వీరు హిట్స్ అందుకుంటారో లేదో చూడాలి.







