టీ20 చరిత్రలో అంతర్జాతీయ స్థాయిలో సౌత్ ఆఫ్రికా సరికొత్త రికార్డు..!

ఇటీవలే జరిగిన వెస్టిండీస్ – సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన టీ20 మ్యాచ్ లో ఇరుజట్లు ఒకదానికి మించి మరొకటి భారీ స్కోర్లు నమోదు చేశాయి.టీ20 మ్యాచ్ అంటే సాధారణంగా స్కోరు ఓ 200 వరకు నమోదు అవుతుంది.బ్యాటర్లు ఫామ్ లో ఉంటే ఇంకాస్త పెరిగి దాదాపుగా ఓ 230 పరుగులు చేసే అవకాశం ఉంటుంది.ఈ స్కోర్లు చేదించాలంటేనే అతి కష్టం మీద కింద మీద పడి గెలవడం లేదా ఓడడం జరుగుతుంది.

 South Africa's New International Record In The History Of T20 , South Africa , T-TeluguStop.com

గతంలో 2018లో న్యూజిలాండ్ ఆస్ట్రేలియా మధ్యన జరిగిన టీ20 లో 245 పరుగుల లక్ష్యాన్ని చేదించి ఆస్ట్రేలియా ఓ రికార్డ్ క్రియేట్ చేసింది.ప్రస్తుతం ఆ రికార్డును సౌత్ ఆఫ్రికా( South Africa ) బద్దలు కొట్టి తనకంటూ ఓ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.వెస్టిండీస్ నిర్దేశించిన 259 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా 18.5 ఓవర్లలో చేదించి అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక స్కోరును చేదించి మొదటి స్థానంలో నిలిచింది.

వెస్టిండీస్ బ్యాటర్లు:

జాన్సన్ చార్లెస్ 46 బంతుల్లో 10 ఫోర్లు 11 సిక్సులతో చెలరేగి 118 పరుగులు చేశాడు.చార్లెస్ కేవలం 39 బంతుల్లో సెంచరీ చేయడంతో టీ20 లో వెస్టిండీస్ తరఫున వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు.కైల్ మేయర్స్ 27 బంతుల్లో ఐదు ఫోర్లు, నాలుగు సిక్స్ లతో 51 పరుగులు చేశాడు.రోమారియో షెపర్డ్ 18 బంతుల్లో ఒక ఫోర్ నాలుగు సిక్స్ లతో చేసి 41 పరుగులు చేశాడు.

మొత్తానికి 20 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది వెస్టిండీస్.

ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు

: క్వింటన్ డికాక్ ( Quinton de Kock )9 ఫోర్లు, 8 సిక్స్ లతో సెంచరీ చేశాడు.రిజా హెండ్రిక్స్ 28 బంతుల్లో నాలుగు ఫోర్లు, రెండు సిక్స్లతో 68 పరుగులు చేశాడు.ఇంకా ఏడు బంతులు మిగిలి ఉండగానే 259 పరుగులు చేసి విజేతగా నిలిచింది సౌత్ ఆఫ్రికా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube