సంతూరు సోప్స్ తో వెళ్తున్న లారిని తీసుకుని వెళ్లి సబ్బులు ఉన్న కాటన్స్ అమ్మకానికి పెట్టిన అంతర్రాష్ట్ర నిందితులను SOT LB నగర్ బృందం మరియు మహేశ్వరం పోలీసులు అరెస్ట్ చేయటం జరిగింది,మహారాష్ట్ర లోని ఆలంనేర్ ప్రాంతం లో విప్రో కంపెనీ లో లోడ్ చేసిన హైదరాబాద్ మీదుగా కర్ణాటక కు వెళ్తున్న లారీ ని నగర శివారు ప్రాంతం లో లారీ ని నిలిపివేసిన దుండగులు,లారీ లో ఉన్న స్టాక్ ను సంగారెడ్డి రుద్రం అనే గ్రామంలో రెండు ఖాళీ షేటర్స్ rent తీసుకుని అందులో పెట్టారు,సంతూర్ సోప్స్ లోడ్ ను మొత్తం అక్కడి నుండి మెల్లగా మచ్చ బొల్లారం కు షిఫ్ట్ చేసిన దుండగులు,మచ్చ బొల్లారం నుండి ఆటో ల ద్వారా అమ్మకాలు ప్రారంభించి ,ఒక్క బాక్స్ ను 3 వేల చొప్పున 188 కాటన్ లని అమ్మటం జరిగింది,లారీని మోసం చేసి దొంగతనం చేసిన అంతర్రాష్ట్ర ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసాం
రాజేష్ వేద్, సుశీల్ బేరా అరెస్ట్.మరో ఇద్దరు నిందితులు వెంకట్, పరీష్ పరారీ లో ఉన్నారు,39 లక్షల విలువైన సంతూర్ సబ్బులు లారీ లో ఉన్నాయి,నిందితులు వద్ద నుండి నగదు 1.55 లక్షలు స్వాధీనం చేసుకున్నాం.నిందితుల నుండి 1112 బాక్స్ సంతూర్ సోప్స్, ఒక లారీ, హోండా స్కూటీ స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కి తరలించినట్లు రాచకొండ సిపి తెలిపారు…
.