ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు మరి కాసేపటిలో ప్రారంభం కానున్నాయి.ఈ మేరకు ఇవాళ్టి నుంచి ఈనెల 22 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి.
కాగా ఇవాళ్టి సమావేశాలను పాత పార్లమెంట్ భవనంలోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది.రేపటి నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో సమావేశాలు జరగనున్నాయి.
అయితే ప్రత్యేక సెషన్ లో భాగంగా కేంద్రం మొత్తం నాలుగు బిల్లులను ప్రవేశ పెట్టనుంది.ఐదు రోజుల ప్రత్యేక సమావేశాలపై ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతున్న తరుణంలో ప్రభుత్వ ఎజెండాను విపక్షాలు అనుమానిస్తున్నాయని తెలుస్తోంది.75 ఏళ్ల పార్లమెంట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఏడు సార్లు మాత్రమే ఈ విధంగా ప్రత్యేక సమావేశాలు జరిగిన సంగతి తెలిసిందే.