ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ సోనీ నుంచి సోనీ ఎక్స్ పీరియా 1 VI స్మార్ట్ ఫోన్( Sony Xperia 1 VI Smartphone ) మే 17న లాంచ్ కానుంది.ఆన్లైన్లో ఈ ఫోన్ కు సంబంధించిన డిజైన్, స్పెసిఫికేషన్ వివరాలు లీక్ అయ్యాయి.
అవి ఏమిటో చూద్దాం.ఈ ఫోన్ Quad HD ప్లస్ డిస్ ప్లే( Quad HD Plus Display ) తో వస్తోంది.
స్నాప్ డ్రాగన్ 8జెన్ 3 చిప్ సెట్ తో వస్తుంది.ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టం ద్వారా పనిచేస్తుంది.
ఈ ఫోన్ 48ఎంపీ Exmor T సెన్సార్+12ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా+ టెలిఫోటో లెన్స్ తో కూడిన ట్రిపుల్ రియల్ కెమెరా సెటప్ తో ఉంటుంది.ఇక వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16ఎంపీ లేదా 32ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తుందని సమాచారం.
ఈ ఫోన్ 5000mAh బ్యాటరీ సామర్థ్యం( Battery Life ) కలిగి ఉంటుంది.ఈ ఫోన్ సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్ అందిస్తుంది.ఈ ఫోన్ బ్యాటరీని చార్జ్ చేయడానికి 30వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ లేదా 15 వాట్స్ వైర్ లెస్ ఛార్జింగ్ సదుపాయంతో రానుంది.ఈ స్మార్ట్ ఫోన్ స్టోరేజ్( Smartphone Storage ) విషయానికి వస్తే.8GB RAM+256GB స్టోరేజ్, 16GB RAM+ 512GB స్టోరేజ్ వేరియంట్ లలో అందుబాటులో ఉండనుంది.ఒకవేళ కావాలనుకుంటే స్టోరేజ్ పెంచుకునేందుకు మైక్రో SD కార్డ్ స్లాట్ సదుపాయం కూడా ఉంటుంది.
ఇక ఈ ఫోన్లో ఉండే మిగతా ఫీచర్ల విషయానికి వస్తే. ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, డాల్బీ ఆడియో( Dolby Audio ) లాంటి ప్రత్యేకమైన ఫీచర్లతో పాటు AI ఫీచర్లతో రానున్నట్లు సమాచారం.ఇక ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ లాంచింగ్ సమయంలో వెల్లడించనుంది.