తెలుగులో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం ద్వారా అభిమానులకు దగ్గరైన నటులలో సోనూసూద్( Sonusood ) ఒకరు.అతడు, అరుంధతి, దూకుడు సినిమాలు నటుడిగా సోనూసూద్ రేంజ్ పెంచాయి.
సోనూసూద్ ఎంతోమందికి సహాయం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే.తను సంపాదించిన డబ్బులో ఎక్కువ మొత్తాన్ని సోనూసూద్ ఇతరులకు సహాయం చేయడం గమనార్హం.
సోనూసూద్ ను విలన్ పాత్రల్లో ఫ్యాన్స్ చూడలేకపోవడంతో ఈ మధ్య కాలంలో ఆయనకు విలన్ రోల్స్( villain roles ) కూడా ఎక్కువగా రావడం లేదు.తెలుగు కంటే ఇతర భాషల సినిమాల్లోనే సోనూసూద్ ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం.
అయితే తాజాగా సోనూసూద్ అభిమాని చేసిన పనికి ఫిదా అయ్యారు.సోనూసూద్ తన ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ కు వెళ్లగా ఒక అభిమాని సోనూసూద్ కు తెలియకుండా ఆయన బిల్ పే చేశారు.

“దేశం కోసం మీరు చేస్తున్న మంచి పనులకు నా తరపున కృతజ్ఞత ఇది” అంటూ ఆ అజ్ఞాతవ్యక్తి చిన్న నోట్ రాసి ఆ నోట్ సోనూసూద్ కంటపడేలా చేశారు.ఆ నోట్ ను సోనూసూద్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది.సోనూసూద్ ఈ ఘటన గురించి స్పందిస్తూ ఈ పని ఎవరు చేశారో నాకు తెలియదని కానీ మా డిన్నర్ బిల్లు మొత్తం చెల్లించి ఈ స్వీట్ నోట్ ను వదిలేసి వెళ్లారని సోనూసూద్ చెప్పుకొచ్చారు.

సోనూసూద్ చేసిన ఈ పోస్ట్ కు 23 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.సోనూసూద్ కు సోషల్ మీడియాలో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.సోనూసూద్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ రేంజ్ లో ఉందని తెలుస్తోంది.
సోనుసూద్ కెరీర్ పరంగా మరింత ఎదగాలని నెటిజన్లు ఫీలవుతున్నారు.సోనూసూద్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.







