Sonusood: లగ్జరీ కారును కొనుగోలు చేసిన హీరో సోనూసూద్.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

సోనూసూద్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కరోనా లాంటి విపత్కర పరిస్థితులలో ఎంతోమందికి అండగా నిలిచి రియల్ లైఫ్ హీరో అనిపించుకున్నాడు.

 Sonu Sood Buys Luxury Bmw 7 Series Car Cost Details Inside Details, Sonu Sood, B-TeluguStop.com

అంతేకాకుండా సోనూ సూద్ ని కలియుగ కర్ణడు అని కూడా పిలుస్తూ ఉంటారు.కరోనా లాక్‌డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు నటుడు సోనూసూద్.

లక్షలాది మంది ప్రజలకు ఆహారం అందించడంతోపాటు వాహనాల్లో వారి వారి గమ్య స్థానాలకు కూడా చేర్చాడు.సోను సూద్ సినిమాలలో చేసేది విలన్ పాత్రలే అయినప్పటికీ సాయం కావాలంటూ తనదగ్గరకు వచ్చినవారందరికీ లేదు వాడకుండా అతనికి తోచిన సహాయం చేశాడు.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా సోనుసూద్ కి సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.

అదేమిటంటే తాజాగా ఒక ప్రముఖ లగ్జరీ కార్ ని కొనుగోలు చేశాడు.లగ్జరీకి, బ్రాండ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన బీఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్‌ కారును సొంతం చేసుకున్నాడు.

తన కొత్తకారు ముందు దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు.

Telugu @sonusoodarmy, Buy Car, Cost, Luxury Bmw Car, Sonusood, Sonu Sood, Sonuso

కాగా సోనుసూద్ కొనుగోలు చేసిన ఆ కారు ఖరీదు దాదాపు రూ.1.73 కోట్లని తెలుస్తోంది.ఈ కార్ తో పాటుగా సోనూసూద్‌ గ్యారేజీలో పోష్‌ పనమేరా, మెర్సిడిస్‌ బెంజ్, ఆడి క్యూ 7 కార్లు కూడా ఉన్నాయి.ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వటంతో ఆ కారు ధర తెలిసి చాలామంది నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.

అయితే సోనూసూద్ ఒక స్టార్ సెలబ్రిటీ అయినప్పటికీ ఎటువంటి హంగామా లేకుండా ఎంతో సింపుల్ గా ఉంటూ ఉంటాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube