ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఆరు గ్యారంటీలలో భాగంగా ఈరోజు రెండు గ్యారెంటీలను ప్రారంభించడం జరిగిందన్నారు.ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ 10 లక్షల ఉచిత భీమా అమలు చేయడం జరుగుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ పాలనను ప్రజలు కోరుకున్నారన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి,పొన్నాల మల్లారెడ్డి, మేడిశెట్టి దేవచంద్రం, కంకణాల శ్రీనివాస్, రాగుల చరణ్, మేడిశెట్టి రాజశేఖర్, మేడిశెట్టి రాజు, జాగిరి బుచ్చి రాములు, వడ్నాల దేవయ్య, అగ్రహారం గ్రామ శాఖ అధ్యక్షుడు మామిళ్ళ కిషన్ తదితరులు పాల్గొన్నారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి
Advertisement

Latest Rajanna Sircilla News