సోనియా రిటైర్మెంట్ ప్రకటించలేదు ! అవన్నీ అపోహలే ?

యూపీఏ చైర్పర్సన్,  కాంగ్రెస్ కీలక నేత సోనియాగాంధీ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించినట్లుగా నిన్నటి నుంచి మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు,  సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.సోనియా   పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారని , ఇక విశ్రాంతిలోనే ఆమె గడుపుతారని , పూర్తి బాధ్యతలన్నీ రాహుల్ గాంధీనే తీసుకుంటారని ప్రచారం మొదలైంది .

 Sonia Did Not Announce Retirement! Are They All Myths Sonia Gandhi, Rahul Gandhi-TeluguStop.com

అయితే ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా సోనియాగాంధీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారనే చర్చలు మొదలయ్యాయి.

Telugu Aicc, Bharathjodo, Congress, Manmohan Singh, Prime India, Rahul Gandhi, S

 ఇది ఇలా ఉంటే అసలు సోనియా గాంధీ రాజకీయాలకు దూరమవుతున్నట్లుగా ప్రకటించలేదని,  ఇవన్నీ వాస్తవ విరుద్ధ కథనాలు అని కాంగ్రెస్ ప్రకటించింది .కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో సోనియా గాంధీ మాట్లాడారు.తన ఇన్నింగ్స్ పూర్తికానుండడం సంతోషంగా ఉందని అన్నారు.భారత్ జోడో యాత్ర పార్టీకి మేలు చేకూర్చునుందని ఆమె ప్రకటించారు.చత్తీస్ ఘడ్ రాజధాని రాయపూర్ లో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న పార్టీ 85 వ ప్లీనరీ రెండో రోజు సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనుకు ఎంతో సంతోషాన్ని కలిగించాయని , కాంగ్రెస్ పార్టీని మలుపుతిప్పిన భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషంగా ఉందని సోనియా ప్రకటించారు.

Telugu Aicc, Bharathjodo, Congress, Manmohan Singh, Prime India, Rahul Gandhi, S

అయితే ఈ వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు తప్పుగా అర్థం చేసుకుని సోనియా గాంధీ రిటైర్మెంట్ ప్రకటించారని కథనాలను ప్రచారం చేశాయి.అయితే వీటిలో ఏమాత్రం వాస్తవం లేదని కాంగ్రెస్ చత్తీస్ ఘడ్ వ్యవహారాల ఇన్చార్జి సెల్జా అన్నారు.పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం సంతోషంగా ఉందని మాత్రమే సోనియా అన్నారని,  రాజకీయాలకు దూరమవుతున్నట్లుగా ఆమె ఎక్కడ ప్రకటించలేదని,  ప్రత్యక్ష రాజకీయాల నుంచి ఇప్పట్లో వైదొలగే ఉద్దేశం సోనియాకు ఏమాత్రం లేదని,  మీడియా సోషల్ మీడియాలో వస్తున్న కథనాలన్నీ కేవలం అపోహలైనని సెల్జా ప్రకటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube