టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో ఆది సాయికుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సాయి కుమార్ వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ హీరోగా పలు సినిమాలలో నటించే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
మొదట ప్రేమ కావాలి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అది సాయికుమార్ ఆ తర్వాత బలి సినిమాలలో నటించి మెప్పించాడు.మొదటి సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత ఆది సాయి కుమార్ కు వరుసగా అవకాశాలు వస్తాయని అభిప్రాయపడ్డారు.కానీ ఊహించిన విధంగా అవకాశాలు మాత్రం రాలేదు.

ఇకపోతే అది సాయికుమార్ సినీ కెరియర్ను మొదలుపెట్టి నేటికి 12 ఏళ్లు పూర్తి అయింది.ఈ 12 ఏళ్ళ సినీ కెరియర్ లో ఆది సాయికుమార్ ఎన్నో ప్రయోగాలు చేశారు.సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ ప్రేక్షకులను ముప్పించడానికి ప్రయత్నించాడు.అలా తెలుగులో ప్రేమ కావాలి, లవ్‌లీ, సుకుమారుడు, శమంతకమణి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ, శశి లాంటి సినిమాలలో నటించి మెప్పించాడు ఆది.ఇకపోతే ఆది సాయి కుమార్ గత ఏడాది ఐదు సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.కరోనా వల్ల ఆది నటించిన సినిమాలు కాస్త ఆలస్యం అయ్యాయి.
దీంతో గత ఏడాది తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో,బ్లాక్ అతిథి దేవో భవ, టాప్ గేర్ అంటూ ఇలా వరుసగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.చివరగా వచ్చిన టాప్ గేర్ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఆది సాయి కుమార్ ఓటీటీ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు.పులి మేక అనే వెబ్ సిరీస్‌లో ఆది సాయి కుమార్ నటించిన విషయం తెలిసిందే.లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో నటించిన అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం జీ5లో ట్రెండ్ అవుతోంది. ఫోరెన్సిక్ టీమ్ హెడ్ ప్రభాకర్ శర్మ పాత్రలో ఆది కనిపించిన తీరు, నటించిన సీన్ల గురించి అంతా చర్చించుకుంటున్నారు.
ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్నా కూడా ఇలా ఓటీటీలోనూ నటించి ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చారు.అలా ఆది సాయికుమార్ తన కెరియర్ లో ఎన్నో ఉపయోగాలను చేస్తూ, కొత్త కొత్త ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ గా కూడా నిలిచాడు.







