ఆ సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకున్నా.. సోనాలి కామెంట్స్ వైరల్! 

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో నటి సోనాలి బింద్రే ( Sonali Bindre ) ఒకరు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.

అయితే తాజాగా ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.త్వరలోనే సోనాలి బింద్రే ది బ్రోకెన్ న్యూస్ ( The Broken News ) అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

Sonalis Comments Go Viral Even If She Wants To Leave The Industry If She Cant

ఈ వెబ్ సిరీస్ మే మూడవ తేదీ జీ 5లో ప్రసారానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె తన సినీ కెరియర్ తొలి రోజులను గుర్తు చేసుకున్నారు.కెరియర్ మొదట్లో నాకు డాన్స్ పెద్దగా రాకపోయేది కాదు, దీంతో అందరూ కూడా నన్ను హేళన చేసేవారు.

ఆ సమయంలో తనకు ఏం చేయాలో దిక్కుతోచేది కాదు అందుకే వీలైనప్పుడల్లా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండే దానిని తెలిపారు.

Sonalis Comments Go Viral Even If She Wants To Leave The Industry If She Cant
Advertisement
Sonali's Comments Go Viral Even If She Wants To Leave The Industry If She Can't

ఇక బొంబాయి సినిమాలోని హమ్మా హమ్మా ( Hamma Hamma Song ) పాటకు ప్రభుదేవా ( Prabhudeva ) కొరియోగ్రాఫర్ గా చేశారు.ఈ పాటను నేను సవాల్ గా తీసుకొని మరి డాన్స్ ప్రాక్టీస్ చేశానని తెలిపారు.ఇక మణి రత్నం గారు లాంగ్ షాట్స్ ఎక్కువగా తీస్తారు కనుక చాలా వరకు సింగిల్ టేక్ లోనే ఈ పాట పూర్తి చేశానని తెలిపారు.

అయితే ఈ పాటకు డాన్స్ చేసిన తర్వాత సుందరం మాస్టర్ ( Sundaram Master ) ఈ పాటను చూసి నన్ను ఒప్పుకున్నారని నాకు వంద రూపాయలు బహుమతి కూడా ఇచ్చారని తెలిపారు.అలాంటి గొప్పవారు నన్ను మెచ్చుకోవడంతో ఇక ఎవరేమనుకున్న నేను పట్టించుకోనని భావించాను అప్పుడే నాకు ధైర్యం కూడా వచ్చిందని తెలిపారు.

ఈ పాట కనక తను చేయలేకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామని అనుకున్నాను కానీ మంచి సక్సెస్ అయింది అందుకే ఈ పాట నాకు ఎప్పటికీ ప్రత్యేకమని సోనాలి బింద్రే తెలిపారు.

మలబద్ధకాన్ని తరిమికొట్టే బెస్ట్ డ్రింక్స్ ఇవి.. రోజు తీసుకుంటే మరెన్నో లాభాలు!
Advertisement

తాజా వార్తలు