అందాల భామ సోనాక్షి సిన్హా( Sonakshi Sinha ) లేటెస్ట్ వెబ్ సీరీస్ దహాద్( Dahaad ) అమేజాన్ ప్రైం లో రిలీజైంది.ఒకప్పుడు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక ఊపు ఊపేసిన ఈ దబాంగ్ బ్యూటీ ఇప్పుడు అరకొర అవకాశాలతో కెరీర్ సాగిస్తుంది.
అయినా కూడా తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుంది.లేటెస్ట్ గా సోనాక్షి సిన్హా దహాద్ వెబ్ సీరీస్ తో సందడి చేస్తుంది.
ఈ సీరీస్ లో అమ్మడు పోలీస్ ఆఫీసర్ గా నటించింది.రీమా కగ్తి.
రుచిక ఒబెరాయ్ లు ఈ వెబ్ సీరీస్ ని డైఎక్ట్ చేశారు.
మిస్ అవబడుతున్న అమ్మాయిలంతా కూడా మృతిచెందడం.అలా ఒకరితో మొదలు పెట్టిన ఇన్వెస్టిగేషన్ లో దాదాపు 27 మంది మహిళలు చంపబడటం లాంటి క్రైం థ్రిల్లర్ నేపథ్యంతో ఈ వెబ్ సీరీస్ వచ్చింది.దర్శకులు ఈ వెబ్ సీరీస్ ని కొంతమేరకు సమర్ధవంతంగానే నడిపించారు.
కానీ సీరీస్ కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తుంది.అయితే సోనాక్షి ఫస్ట్ టైం డిజిటల్ స్ట్రీమింగ్ లో చేసిన సీరీస్ కాబట్టి ఆ క్రేజ్ తో ఈ సీరీస్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది.
వెబ్ సీరీస్ లో సోనాక్షి పోలీస్ గా నటించిన తీరు చూసి ఎన్నాళ్లకెన్నాళ్లకు సోనాక్షిని ఇలా చూస్తున్నాం అంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.