డబ్బుపై ఉన్న అతి ఆశ కారణంగా ఒక్కోసారి మనిషి ఏం చేస్తున్నాడో తనకే అర్థం కాకుండా చేస్తున్నాడు.తాజాగా హైదరాబాదులో కాబోయే అత్తగారింట్లోనే కన్నం వేసిన అల్లుడు కటకటాల పాలైన సంఘటన పాతబస్తీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతంలోని శాస్తిపురం కింగ్ కాలనీలో సల్మాన్ ఖాన్ అనే యువకుడు నివసిస్తున్నాడు.అయితే ఇతడికి తాజాగా కాలపత్తర్ ప్రాంతానికి చెందిన ఓ యువతో వివాహం నిశ్చయమయ్యింది.
అయితే వివాహం నిశ్చమయినప్పటి నుంచి యువతితో సల్మాన్ కొంత చనువుగా ఉండేవాడు.మరి కొద్దీ రోజుల్లో పెళ్లి దగ్గరికొస్తుండటంతో యువతీ తల్లిదండ్రులు పెళ్ళికి కావలసిన నగలు, డబ్బు, వంటివి సిద్ధం చేసుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న సల్మాన్ తన దుర్భుద్ధితో వాటిని కాజేయాలని ప్లాన్ చేసాడు.ఈ క్రమంలో ఇంట్లోని వాళ్లంతా ప్రార్థనల నిమిత్తమై దర్గాకి వెళ్లారు.
ఈ విషయాన్ని పెళ్లి కుమార్తె ద్వారా సల్మాన్ ఖాన్ తెలుసుకున్నాడు.ఇదే అదునుగా చేసుకుని ఇంటికి అమర్చిన కిటికీని పగలగొట్టి ఇంట్లోకి దూరి బీరువాలో పెళ్లి కోసమని దాచిన నగలు, డబ్బులు తీసుకుని పారిపోయాడు.పెళ్లి కోసమని దాచుకున్న నగలు డబ్బులు కనిపించక పోవడంతో కాలపత్తర్ పట్టణ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.భాదితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇంటి చుట్టూ ప్రక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు.
ఇదంతా చేసింది తమకు కాబోయే అల్లుడని తెలుసుకున్న ఆ యువతి తల్లిదండ్రులు సల్మాన్ తో వెంటనే పెళ్లి రద్దు చేసుకున్నారు.
.