అమరావతిలో బీజేపీ పాదయాత్రతో పొత్తులు పొడిచే విధంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.బీజేపీ రాష్ట్ర చీఫ్ సోము విర్రాజు టీడీపీపై సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నట్లు కనిపిస్తోంది.
తెర వెనుక జరిగిన పరిణామాలతో ఈ మార్పులు కనిపిస్తున్నాయని అంటున్నారు.బీజేపీ తోడు లేకపోవడంతోనే గత ఎన్నికల్లో బాబు ఓడిపోయారనే సంకేతాలు ఇచ్చారు.
గత ఎన్నికల ఫలితాల తర్వాత బాబు ఎందుకు ఇంత ఘోర పరాజయం చవిచూసామో ఆలోచించని రోజు ఉండదనుకోండి .ఇప్పుడు సడెన్ గా సోము మాటలతో నిజంగానే అలా జరిగిందా… ఒకవేళ అదే జరిగిందనుకుంటే మరి వచ్చే ఎన్నికల్లో బాబు బీజేపీ ఒక్కటి కాబోతుందా.అనే అనుమానాలు వ్తక్యమవుతున్నాయి.
ఇక సోము కూడా రెండేళ్లుగా బీజేపీ ప్రెసిడెంట్ గా ఉన్నారు.
అయితే ఈ తరహా రాజకీయ విశ్లేషణ ఇన్నిరోజుల్లో ఎప్పుడూ చేయలేదు.బ్రేకింగ్ న్యూస్ లో అమరావతిలో బీజేపీ పాదయాత్ర వేళ ఆయనకు బాబు ఎందుకు ఓడారో తెలిసిందా లేక మనసులో ఇదివరకే ఉన్నదా.
మరి ఇప్పుడు ఎందుకు బయటపెట్టినట్లు.పై నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా.
అంటున్నారు.
బాబు గత ఎన్నికల ముందు బీజేపీతో విభేదించి బయటకి వచ్చేశారు.
అంతే కాకుండా యూపీఏ కూటమితో జత కట్టారు.పైగా ప్రధాని మోడీపై తీవ్ర విమర్శలూ చేశారు.
ఇంతటితో ఆగకుండా దేశమంతటా తిరిగి మోడీకి వ్యతిరేకంగా చర్చలు జరిపారు.ఇవన్నీ కూడా బీజేపీ హైకమాండ్ అన్నీ పరిగణలోకి తీసుకున్నట్లు అనుకున్నారు.
ఇక ఏపీలో కూడా బీజేపీ నేతలలో సోము వీర్రాజు మొదటి నుంచి వ్యతిరేకంగానే ఉన్నారు.కానీ ప్రస్తుతం ఆయన మాటలు మరోలా ఉన్నాయి.
బాబు మాతో కలవనందుకే ఓడారు అని బయటకు అంటున్నారు.అంటే.
ఇప్పడు కూడా జత కట్టకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా నెగ్గలేరని ముందుగానే హింట్ ఇస్తున్నారా.అని అనుకుంటున్నారు.
బాబు కూడా ఇలాగే ఆలోచించి బీజేపీతో చెతులు కలుపుతారేమో చూడాలి.

అయితే బాబును వ్యతిరేకించే సోము పొత్తు విషయంలో ఇప్పటికే మెత్తబడ్డారా.లేక హై కమాండ్ ఆదేశాల మేరకు బాబు మీద సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారా.అనే చర్చ సాగుతోంది.
అంతేకాకుండా రాజధాని విషయంలో కూడా బాబు అనుకున్న అమరావతికే బీజేపీ ఓటు వేయడం.పాదయాత్ర చేయడం విశేషం.
మొత్తానికి తెరవెనుక పొత్తు చర్చలు నడుస్తున్నాయనే చర్చ సాగుతోంది.చూడాలి మరి ఇక పొత్తు.
అంటారా.పోటీ పడతాం అంటారా…