యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం సినిమా విడుదలకు సిద్ధమయింది.ఈ సినిమాకు రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించాడు.
సినిమా నితిన్ సొంత బ్యానర్ లో ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి నిర్మించడం జరిగింది.సినిమా విడుదల సమయం లో వరుసగా వివాదాలతో తల గోక్కున్నట్లు అవుతోంది.
ఇటీవలే దర్శకుడు రాజశేఖర్ రెడ్డి గతంలో చేసిన వ్యాఖ్యలు అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా కుల వ్యతిరేక పోస్ట్ లను వెలుగులోకి తీసుకు వచ్చే ప్రయత్నం చేశారు.ఆ వ్యాఖ్యలు నేను చేయలేదు అంటూ రాజశేఖర్ రెడ్డి పోలీసుల ముందుకు వెళ్ళాడు.
అయినా కూడా ఈ సినిమా విషయం లో వివాదం రాజుకుంటోంది.
తాజాగా విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ సినిమా యొక్క ప్రభావం ఈ సినిమా పై ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, రామారావు ఆన్ డ్యూటీ సినిమా విడుదల నేపథ్యం లో సినిమా కు వ్యతిరేకం గా ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అదే విధంగా మాచర్ల నియోజకవర్గం సినిమా కు కూడా ఇబ్బందులు తప్పేలా లేవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు.

సినిమా థియేటర్ల వద్ద మరియు రోడ్ల మీద రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించాలని ఒక సామాజిక వర్గం వారు భావిస్తున్నారట.ఆంధ్రప్రదేశ్లో మాచర్ల నియోజకవర్గం సినిమా పరిస్థితి ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.హీరో నితిన్ ఇప్పటికే వరుసగా ఫ్లాపులతో సతమతమవుతున్న సమయం లో ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనుకుంటే.
ఏంటో ఈ పరిస్థితి అని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సినిమా కు ఎలాంటి టాక్ వచ్చినా కూడా దర్శకుడి వివాదం కారణంగా ఏపీ లో కలెక్షన్స్ పై ప్రభావం ఉండే అవకాశం కనిపిస్తోంది.







